
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ జ్యువెల్లరీ సంస్థ రిలయన్స్ జ్యువెల్లస్ ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కలెక్షన్‌ను విడుదల చేసింది. ప్రేమికుల ప్రేమానురాగాలకు, భావోద్వేగానికి చిహ్నంగా ‘బీ లవ్డ్’ పేరుతో ప్రత్యేకంగా బంగారు నగలను , ముఖ్యంగా డైమండ్ ఆభరణాలను ఆవిష్కరించామని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
‘తేనెటీగ’ స్ఫూర్తిగా తీర్చిదిద్దిన కలెక్షన్లను జీవితంలో ప్రతీక్షణాన్ని అత్భుదమైన శక్తి, సామర్థ్యాలతో సమతుల్యంగా నిర్వహిస్తున్న నేటి మహిళలకు అంకితం చేస్తున్నామని రిలయన్స్ జ్యువెల్లస్ సీఈవో సునీల్ నాయక్ వెల్లడించారు. ముఖ్యంగా హనీ బీ మేళవింపుతో వాలెంటైన్స్ డే సందర్భంగా డైమండ్ పెండెట్స్, చెవి రింగులు, ఉంగరాలను రూ.10వేలనుంచి ప్రారంభయ్యేలా ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టు తెలిపారు. అలాగే ఫిబ్రవరి 24 దాకా అన్ని రకాల శోభాయమైన డైమండ్ నగలు, వెడ్డింగ్ కలెక్షన్స్‌పై 20శాతం దాకా డిస్కౌంట్ అందిస్తున్నామని ప్రకటించారు.