వన్‌ప్లస్‌కి ఝలక్‌ : వరల్డ్స్‌ ఫాస్టెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ | Redmi K20 Pro India Launch Teaser by Xiaomi Calls It the World Fastest Phone | Sakshi
Sakshi News home page

వన్‌ప్లస్‌కి ఝలక్‌ : వరల్డ్స్‌ ఫాస్టెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌

Jun 17 2019 8:57 AM | Updated on Jun 17 2019 9:12 AM

Redmi K20 Pro India Launch Teaser by Xiaomi Calls It the World Fastest Phone - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చైనా మొబైల్‌ సంచలనం షావోమి తన అభిమానులను త్వరలోనే మరోగుడ్‌ న్యూస్‌తో ఆకట్టుకున్నారు.  తన సబ్ బ్రాండ్ రెడ్‌మి కింద  ప్రపంచంలోనే అతివేగవంతమైన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్‌ చేయనుంది.  కే20 ప్రొ  పేరుతో దీన్ని ఆవిష్కరించింది. ఈ మేరకు  షావోమి  హెడ్‌ మనుకుమార్‌ జైన్‌ ట్విటర్‌ ట్వీట్‌ చేశారు. కే సిరీస్‌లో భాగంగా కే 20, కే20  ప్రొనులాంచ్‌ చేయనున్నామని వెల్లడించారు.   స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 48 ఎంపీ కెమెరా, పాపప్ సెల్ఫీ కెమెరా. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్, సూపర్ వైడ్ యాంగిల్ లెన్స్, 2 రోజుల బ్యాటరీ లైఫ్ ఫీచర్లు ఉండనున్నాయని అంచనా. చైనాలో గత నెలలోనే  రెడ్‌మి కే 20ప్రొను లాంచ్‌  చేసింది. 

మరోవైపు మను కుమార్ జైన్ తన ట్విటర్‌ ద్వారా వన్‌ప్లస్ 7, 7 ప్రో ఫోన్లకు సంబంధించి కంపెనీకి శుభాకాంక్షలు చెబుతూనే పనిలో పనిగా తనదైన శైలిలో ఝలక్‌ ఇచ్చారు. మరో ఫ్లాగ్‌షిప్ కిల్లర్ 2.0 స్మార్ట్‌ఫోన్ తీసుకువస్తున్నామంటూ ట్వీట్‌ చేశారు.

రెడ్‌మి కే20  ప్రొ ఫీచర్లు 
6.39 అంగుళాల స్క్రీన్ 
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్ 
6/8జీబీ ర్యామ్‌, 64/256 జీబీ స్టోరేజ్‌
48+8+13 ఎంపీ రియల్‌ కెమెరా
20 ఎంపీ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ

6జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ ధర  సుమారు రూ.26,200
8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ ధర సుమారు రూ. 30,200

రెడ్‌మి కే 20 ధర  సుమారు రూ. 20,160

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement