రెడ్‌మీ 9 ప్రైమ్ లాంచ్ : అందుబాటు ధరలో

Redmi9 Prime launched in India   - Sakshi

సాక్షి, ముంబై:  చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమి  తాజా స్మార్ట్ ఫోన్ ను అందుబాటు ధరలో  లాంచ్ చేసింది.  రెడ్‌మి 9 ప్రైమ్ పేరుతో  రెండు వేరియంట్లలో   భారత మార్కెట్లలో మంగళవారం విడుదల చేసింది.  ఇది  ఆగస్టు 17వ తేదీ నుంచి అమెజాన్ , ఎంఐ స్టోర్ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. నాలుగు రంగుల్లో రెడ్‌మి 9 ప్రైమ్ స్మార్ట్ ఫోన్ లభ్యం. అలాగే ప్రైమ్ డే సేల్ సందర్భంగా అమెజాన్ ద్వారా ఆగస్టు 6 న ఉదయం 10 గంటలకు ఈ స్మార్ట్‌ఫోన్ దేశంలో తొలిసారి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

ధరలు 
4 జీబీ ర్యామ్ /128 జీబీ స్టోరేజ్ : 11999 రూపాయలు
4 జీబీ ర్యామ్/ 64 జీబీ స్టోరేజ్  : 9999 రూపాయలు

రెడ్‌మీ ​​​​​9 ప్రైమ్ ఫీచర్లు
6.53 అంగుళాల డిస్ ప్లే
1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 10
మీడియాటెక్ హెలియో జీ80 ప్రాసెసర్
8 మెగాపిక్సెల్ సెల్ఫీ  కెమెరా
13 8+5+2 మెగాపిక్సెల్  క్వాడ్ రియర్ కెమెరా
5020 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top