పీఎంసీ బ్యాంక్‌లో నగదు విత్‌డ్రా పరిమితి పెంపు | RBI Enhances Withdrawal Limit For PMC Bank Depositors To Rs 50,000 | Sakshi
Sakshi News home page

పీఎంసీ బ్యాంక్‌లో నగదు విత్‌డ్రా పరిమితి పెంపు

Nov 6 2019 5:20 AM | Updated on Nov 6 2019 5:20 AM

RBI Enhances Withdrawal Limit For PMC Bank Depositors To Rs 50,000 - Sakshi

ముంబై: పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోఆపరేటివ్‌ బ్యాంక్‌ (పీఎంసీ) డిపాజిటర్లకు మరింత ఊరట లభించింది. ఒక్కో ఖాతా నుంచి గరిష్ట నగదున ఉపసంహరణ పరిమితి రూ. 50,000 వరకు పెంచినట్లు ఆర్‌బీఐ మంగళవారం ప్రకటించింది. అంతక్రితం ఈ పరిమితి రూ. 40,000గా ఉండగా.. తాజాగా మరో రూ. 10,000 పరిమితి పెంచింది. రుణాల విషయంలో బ్యాంక్‌ యాజమాన్యం అక్రమాలకు పాల్పడిందని తేలిన నేపథ్యంలో ఆ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆరు నెలల పాటు ఆంక్షలను అమలు చేసిన విషయం తెలిసిందే.

సెపె్టంబర్‌ 23న ఈ విషయాన్ని ప్రకటించిన ఆర్‌బీఐ.. తొలుత ఒక్కో ఖాతా నుంచి రూ. 1,000 ఉపసంహరణకే అనుమతించింది. ఆ తరువాత, తాజా ప్రకటనతో కలుపుకుని నాలుగు విడతలుగా పరిమితిని పెంచింది. ద్రవ్య లభ్యత అంశాన్ని పరిగణలోనికి తీసుకుని ఎప్పటికప్పుడు ఉపసంహరణ పరిమితిని పెంచుతున్నామని, ఈ క్రమంలోనే రూ. 50,000 పరిమితి పెంపు అనుమతి ఇచి్చనట్లు వివరించింది. డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించడం కోసం బ్యాంక్‌లోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement