సహకార బ్యాంకుల పనితీరుపై ఆర్‌బీఐ సమీక్ష

RBI central board discusses policy framework for cooperative banks - Sakshi

భువనేశ్వర్‌:   పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోఆపరేటివ్‌ బ్యాంకు (పీఎంసీ) స్కామ్‌తో లక్షల మంది డిపాజిటర్లు సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అర్బన్‌ సహకార బ్యాంకుల పనితీరును రిజర్వ్‌ బ్యాంక్‌ సెంట్రల్‌ బోర్డు శనివారం సమీక్షించింది. ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు, అంతర్గతంగాను.. అంతర్జాతీయంగాను దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు మొదలైన అంశాలు కూడా చర్చించింది. గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సారథ్యంలో సమావేశమైన సెంట్రల్‌ బోర్డు.. పట్టణ ప్రాంత కోఆపరేటివ్‌ బ్యాంకులు, వాటితో పాటు నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థల్లో నిబంధనల అమలు తదితర అంశాలను సమీక్షించిందని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. రియల్టీ సంస్థ హెచ్‌డీఐఎల్‌కు మొత్తం రూ. 6,226 కోట్ల మేర రుణాలిచ్చినప్పటికీ .. పీఎంసీ బ్యాంకు కేవలం రూ. 440 కోట్లు మాత్రమే ఇచ్చినట్లు ఆర్‌బీఐకి చూపించిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్‌ బైటపడటంతో పీఎంసీ బ్యాంకు ఖాతాదారుల విత్‌డ్రాయల్స్‌పై ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top