అనుకోకుండా.. ఇన్వెస్ట్‌ చేశా!

Ratan Tata reveals how he picks a startup to invests - Sakshi

స్టార్టప్‌లపై రతన్‌ టాటా

ముంబై: కొన్నాళ్లుగా పలు స్టార్టప్‌లలో పెట్టుబడులతో వార్తల్లో నిలుస్తున్న పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా తన ఇన్వెస్ట్‌మెంట్స్‌పై పెదవి విప్పారు. అనుకోకుండానే తాను స్టార్టప్‌లలో ఇన్వెస్ట్‌ చేయడం మొదలుపెట్టినట్లు వెల్లడించారు. ‘నేను కొంత అనుకోకుండానే స్టార్టప్‌ ఇన్వెస్టరుగా మారానని చెప్పవచ్చు. టాటా గ్రూప్‌లో కీలక హోదాలో ఉన్నప్పుడు స్టార్టప్‌ సంస్థలు ఆసక్తికరంగానే అనిపించినప్పటికీ.. వాటిని కాస్త అంటరానివిగానే చూసేవాణ్ని. ఎందుకంటే ఏదో ఒకటి, ఎక్కడో ఒక చోట టాటా గ్రూప్‌నకు ప్రయోజనాల వైరుధ్యం ఉండేది.

కానీ నేను రిటైరయిన తర్వాత స్వేచ్ఛ లభించడం వల్ల ఆసక్తికరంగా అనిపించిన సంస్థల్లో నా సొంత డబ్బును కాస్త కాస్తగా ఇన్వెస్ట్‌ చేయడం ప్రారంభించాను. అలా అంతకు ముందుతో పోలిస్తే నేను మరికాస్త ఎక్కువ రిస్కులు తీసుకున్నాను. మరో విషయం.. పెట్టుబడులు పెడుతున్నా కదా అని నా దగ్గర బోలెడంత డబ్బు ఉందని అనుకోవద్దు‘ అని రతన్‌ టాటా చెప్పుకొచ్చారు. స్టార్టప్స్‌ ప్రమోటర్లలో కసి, వినూత్న ఐడియాలు, అవి అందించే పరిష్కారమార్గాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇన్వెస్ట్‌ చేస్తానని రతన్‌ టాటా చెప్పారు.  ఓలా, పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్, క్యూర్‌ఫిట్, కార్‌దేఖో, అర్బన్‌ల్యాడర్, లెన్స్‌కార్ట్‌ వంటి స్టార్టప్స్‌లో రతన్‌ టాటా వ్యక్తిగత హోదాలో పెట్టుబడులు పెట్టారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top