భారత్‌లో తయారీ ఆలోచన పాతదే! | Rangarajan sees growth prospects improving | Sakshi
Sakshi News home page

భారత్‌లో తయారీ ఆలోచన పాతదే!

Mar 23 2017 1:22 AM | Updated on Oct 9 2018 4:06 PM

భారత్‌లో తయారీ ఆలోచన పాతదే! - Sakshi

భారత్‌లో తయారీ ఆలోచన పాతదే!

‘భారత్‌లో తయారీ’ ఆలోచన పాతదేనని, ఇది విజయవంతం కావాలంటే ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని...

మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలి 
కేంద్రానికి రంగరాజన్‌ సూచన

అహ్మదాబాద్‌: ‘భారత్‌లో తయారీ’ ఆలోచన పాతదేనని, ఇది విజయవంతం కావాలంటే ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ సి.రంగరాజన్‌ కేంద్రానికి సూచించారు. దేశాన్ని తయారీ కేంద్రంగా మలచాలన్న ఉద్దేశంతో మేకిన్‌ ఇండియా (బారత్‌లో తయారీ) పేరుతో మోదీ ప్రభుత్వం ఓ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.

గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్‌గానూ పనిచేసిన రంగరాజన్‌ ఈ అంశంపై  అహ్మదాబాద్‌ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement