జపాన్‌, సౌత్‌కోరియాను చూసి నేర్చుకోవాలి: రాజీవ్‌ బజాజ్ | Rajiv Bajaj Suggestions On Corona Virus Crisis | Sakshi
Sakshi News home page

‘జపాన్‌, సౌత్‌కోరియా విధానాలను అమలు చేయాలి’

Jun 10 2020 5:30 PM | Updated on Oct 5 2020 6:17 PM

Rajiv Bajaj Suggestions On Corona Virus Crisis  - Sakshi

ముంబై: కరోనా నియంత్రణకు ప్రభుత్వ చర్యలు ఫలితాలు ఇవ్వడంలేదని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కరోనా నియంత్రణకు పశ్చిమ దేశాల నమూనా అనుసరిస్తుందని విమర్శించారు. కేంద్రం పశ్చిమ దేశాల నమూనా కాకుండా ఆసియా దేశాలైన జపాన్‌, సౌత్ ‌కోరియా విధానాలను అనుసరించాలని సూచించారు.  వైరస్‌ను నియంత్రిస్తునే ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్న జపాన్‌, సౌత్ ‌కోరియాలు విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. ఆసియా, పశ్చిమ దేశాల రోగనిరోధక వ్యవస్థ విభిన్నంగా ఉంటుందని అన్నారు. 21నుంచి 60సంవత్సరాల వయస్సుల వారిని స్వేచ్చగా కార్యాకలాపాలు నిర్వహించడానికి ప్రభుత్వం అవకాశమివ్వాలని కోరారు.

కాగా తమ సంస్థ విజయానికి మూడు సూత్రాలను వివరించారు. ఎఫ్‌ఐటీ(FIT).. ఇందులో ఎఫ్‌ అంటే ఫోకస్‌, ఐ అంటే ఐడియా, టీ అంటే టీమ్‌ అని తెలిపారు. తమ సంస్థ అంతర్జాతీయ మార్కెట్‌ను నిరంతరం అధ్యయనం చేస్తు విభిన్న మోడళ్లను రూపొందిస్తుందని అన్నారు. మరోవైపు ప్రపంచ మార్కెట్‌ను ఆకర్శించేందుకు సరికొత్త ఐడియాలను అధ్యయనం చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా సంస్థ విజయాలు సబ్బంది పనితీరుపై ఆధారపడి ఉంటాయని.. మైరుగైన సిబ్బందిని నియమించేందుకు ప్రయత్రిస్తామని తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement