మార్కెట్ నిపుణుల కోసం ఎన్‌ఎస్‌ఈ అకాడెమీ | Sakshi
Sakshi News home page

మార్కెట్ నిపుణుల కోసం ఎన్‌ఎస్‌ఈ అకాడెమీ

Published Thu, May 26 2016 1:52 AM

మార్కెట్ నిపుణుల కోసం ఎన్‌ఎస్‌ఈ అకాడెమీ

హైదరాబాద్‌లోనూ కోర్సులు
ముంబై: ఫైనాన్షియల్ మార్కెట్లో నిపుణుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని... అలాంటి వారిని తయారు చేయాలనే లక్ష్యంతో ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజ్ ‘ఎన్‌ఎస్‌ఈ’ తాజాగా ఒక అకాడెమీని ఏర్పాటు చేసింది. ఎన్‌ఎస్‌ఈ ఈ కొత్త అకాడె మీ ద్వారా ఔత్సాహికుల కోసం పలు ఫైనాన్షియల్ కోర్సులను అందుబాటులో ఉంచింది. తొలిగా గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్స్‌కు సంబంధించి 11 నెలల పోస్ట్ గ్రాడ్యు యేట్  సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తున్నట్లు ఎన్‌ఎస్‌ఈ తెలిపింది.

రెగ్యులర్ తరగతులు జూలై 27 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. ఈ అకాడె మీ శాఖ హైదరాబాద్‌లో కూడా ఉంది. హైదరాబాద్‌తో పాటు కోల్‌కతా, అహ్మదాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ నగరాల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉంటాయని ఎన్‌ఎస్‌ఈ తెలియజేసింది.
 

Advertisement
 
Advertisement
 
Advertisement