పీటీసీ ఇండియా ఆదాయం 325 కోట్లు

PTC India income is 325 crores - Sakshi

న్యూఢిల్లీ: పీటీసీ ఇండియా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (పీఎఫ్‌ఎస్‌) కంపెనీ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 23 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ.72 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.56 కోట్లకు తగ్గిందని పీటీసీ ఇండియా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.300 కోట్ల నుంచి రూ.325 కోట్లకు పెరిగిందని  కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ అశోక్‌ హల్దియా చెప్పారు. తాము ఇచ్చిన రుణాలు 22 శాతం వృద్ధితో రూ.13,361కు పెరిగాయని తెలిపారు.

నికర వడ్డీ ఆదాయం రూ.90 కోట్లని, ఇది మొత్తం వడ్డీ ఆదాయంలో 30 శాతమని వివరించారు. ఒత్తిడి రుణాలు పరిష్కారమయ్యే దిశలో ఉన్నాయని, వివిధ మార్గాల ద్వారా ఒత్తిడి రుణాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికల్లా పూర్తి పరిష్కారం కనుగొనగలమని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో  పీఎఫ్‌ఎస్‌ షేర్‌ 6 శాతం లాభంతో రూ.19 వద్ద ముగిసింది.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top