ప్రభుత్వానికి పవన్‌ హాన్స్‌ రూ.5.5 కోట్ల డివిడెండ్‌ | Profit-making Pawan Hans pays Rs 5.52 crore dividend to govt | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానికి పవన్‌ హాన్స్‌ రూ.5.5 కోట్ల డివిడెండ్‌

Feb 3 2017 1:01 AM | Updated on Mar 22 2019 5:29 PM

ప్రభుత్వానికి పవన్‌ హాన్స్‌ రూ.5.5 కోట్ల డివిడెండ్‌ - Sakshi

ప్రభుత్వానికి పవన్‌ హాన్స్‌ రూ.5.5 కోట్ల డివిడెండ్‌

ప్రభుత్వ రంగ పవన్‌ హాన్స్‌ సంస్థ రూ.5.5 కోట్ల డివిడెండ్‌ను ప్రభుత్వానికి చెల్లించింది.

హైదరాబాద్‌: ప్రభుత్వ రంగ పవన్‌ హాన్స్‌ సంస్థ రూ.5.5 కోట్ల డివిడెండ్‌ను ప్రభుత్వానికి చెల్లించింది.ఈ చెక్కును న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజుకు అందించామని పవన్‌ హాన్స్‌ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కార్యక్రమం లో రీ డిజైన్‌ చేసిన తమ కంపెనీ వెబ్‌సైట్‌ను మంత్రి ప్రారంభించారని కంపెనీ సీఎండీ బి.పి. శర్మ పేర్కొన్నారు. వినియోగదారులు సులభంగా తమ హెలికాప్టర్ల సర్వీసులను బుక్‌ చేసుకునేందుకు గాను రూపొందించిన మొబైల్‌ యాప్‌నుకూడా మంత్రి ఆవిష్కరించారని వివరించారు. ప్రస్తుతం 46 హెలికాప్టర్లతో సర్వీసులందజేస్తున్నామని, గత ఆర్థిక సంవత్సరానికి రూ.36కోట్ల నికర లాభం సాధించామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement