లాభాల్లో ముగిసిన మార్కెట్లు | Positive global cues buoy equity markets | Sakshi
Sakshi News home page

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Jul 4 2016 3:52 PM | Updated on Nov 9 2018 5:30 PM

ముంబై: సోమవారం నాటి మార్కెట్లు లాభాలతో ముగిశాయి


ముంబై: సోమవారం నాటి మార్కెట్లు  లాభాలతో ముగిశాయి. ఈ ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు రోజంతా లాభాల్లోనే పయనించాయి. సెన్సక్స్ 134 పాయింట్ల  లాభంతో 27,279   దగ్గర,నిఫ్టీ 42.పాయింట్ల లాభంతో 8,371దగ్గర క్లోజయ్యాయి.
కొంతమంది పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు  దిగినప్పటికీ,  కొనుగోలు సానుకూల సెంటిమెంట్ బాగా బలపడింది.  అలాగే అనుకూల ప్రపంచ సంకేతాలు, పెరిగినముడి చమురు ధరలు,  బలంగా రూపాయి   విలువ వెరసి ఆరో వరుస సెషన్ లో  భారత ఈక్విటీ మార్కెట్లు ఉత్సాహంగా ట్రేడ్ అయ్యాయి. క్యాపిటల్ గూడ్స్, చమురు, గ్యాస్,  ఆటోమొబైల్ స్టాక్స్  లాభాల బాటపట్టాయి. ఫార్మ, ఐటీ షేర్లలో  కొనుగోళ్ల మద్దతు నెలకొంది.

దీనికితోడు ఈ   వర్షాకాలంలో  ఆరోగ్యకరమైన వానలు కురుస్తాయనే అంచనాలతో   పెట్టుబడిదారులు మార్కెట్ పట్ల ఆసక్తిగా ఉన్నారని ఎనలిస్టులు తెలిపారు.  ప్రతికూల యూరోపియన్ మార్కెట్లు రాబోయే ఈవెంట్ నష్టాలు  దలాల్ స్ట్రీట్ లాభాలను పరిమితం చేసిందని విశ్లేషకుల అంచనా.  ఐటీ, ఫార్మా సెక్టార్ లో బైయింగ్  ట్రెండ్  నెలకొనగా,  ప్రాఫిట్  బుకింగ్ కారణంగా  బ్యాంకింగ్ సెక్టార్ నష్టపోయిందని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ధ్రువ్ దేశాయ్ తెలిపారు.
మరోవైపు బులియన్ మార్కెట్లో పసిడి మెరుపులు కొనసాగుతున్నాయి. ఎంసీఎక్స్ మార్కెట్ లో 10.గ్రా. బంగారం ధర 365 రూపాయల లాభంతో 31,828 దగ్గర ఉంది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement