సెయిల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన పీకే సింగ్ | PK Singh took over as chairman of Sail | Sakshi
Sakshi News home page

సెయిల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన పీకే సింగ్

Dec 11 2015 12:23 AM | Updated on Sep 3 2017 1:47 PM

సెయిల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన పీకే సింగ్

సెయిల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన పీకే సింగ్

ప్రభుత్వ రంగ ఉక్కు దిగ్గజ సంస్థ సెయిల్ చైర్మన్‌గా ప్రకాశ్ కుమార్ సింగ్ గురువారం బాధ్యతలు చేపట్టారు.

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఉక్కు దిగ్గజ సంస్థ సెయిల్ చైర్మన్‌గా ప్రకాశ్ కుమార్ సింగ్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈయన మూడేళ్లపాటు సెయిల్‌కు సేవలను అందించనున్నారు. ఈయన 2012 నుంచి దుర్గాపూర్ స్టీల్ ప్లాంటు సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఐఐటీ రూర్కీ పూర్వ విద్యార్థైన పీకే సింగ్ తన కెరీర్‌ను 1980లో బొకారో స్టీల్ ప్లాంటులో ప్రారంభించారు. అటు తర్వాత ఐఐఎస్‌సీవో స్టీల్, దుర్గాపూర్ స్టీల్ ప్లాంటులలో పనిచేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement