మళ్లీ పెట్రో ధరల షాక్‌ | Petrol Diesel Prices Hiked For 17th Day In A Row | Sakshi
Sakshi News home page

వరుసగా 17వ రోజూ పెట్రో వడ్డన

Jun 23 2020 8:25 AM | Updated on Jun 23 2020 1:25 PM

Petrol Diesel Prices Hiked For 17th Day In A Row - Sakshi

పెట్రో బాంబ్‌ పేలుళ్లతో సామాన్యుడి జేబుగుల్ల

సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వాహనదారులకు షాక్‌ ఇస్తున్నాయి. రోజురోజుకూ భారమవుతూ చుక్కలు చూపుతున్నాయి. ఇంధన ధరలను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు మంగళవారం వరుసగా 17వ రోజూ పెంచాయి. పెట్రోల్‌ లీటర్‌కు 20 పైసలు, డీజిల్‌ లీటర్‌కు 63 పైసల మేర పెరిగాయి.

తాజా ధరల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ లీటర్‌ 79.76 రూపాయలు కాగా, డీజిల్‌ లీటర్‌ 79.40కి ఎగబాకింది. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్‌ లీటర్‌ ఏకంగా 82.59కి చేరింది. కరోనా మహమ్మారితో ప్రజల ఆదాయాలు పడిపోయిన క్రమంలో ప్రభుత్వం పెట్రో​ భారాలు మోపుతోందని విపక్షాలు మండిపడుతున్నాయి.

చదవండి : మనకు పెట్రో ఊరట లేనట్టే! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement