పెర్‌ఫాక్ట్‌ షాట్, వ్యూ: వి9 వచ్చేసింది | Perfect Shot, Perfect View , Vivo V9 Launch | Sakshi
Sakshi News home page

పెర్‌ఫాక్ట్‌ షాట్, వ్యూ: వి9 వచ్చేసింది

Mar 23 2018 12:40 PM | Updated on Nov 6 2018 5:26 PM

Perfect Shot, Perfect View , Vivo V9 Launch - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్‌మేకర్‌ వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వివో వి9 పేరుతో ఇప్పటికే థాయ్‌లాండ్‌ మార్కెట్లో  విడుదల చేయగా శుక్రవారం భారత్‌మార్కెట్లో విడుదల చేసింది.   బాలీవుడ్‌ హీరో ఆమీర్‌ ఖాన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ గా ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను రూ.22,990 గా నిర్ణయించింది.  నేటి(మార్చి 23)నుంచి ప్రీ బుకింగ్‌కు అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది.

వివో వి9  ఫీచర్లు
6.3 అంగుళాల  ఫుల్‌ వ్యూ డిస్‌ ప్లే 19.9 యాస్పెక్ట్‌ రేషియో
ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో
ఆక్టాకోర్‌ క్వాల్కం స్నాప్‌ డ్రాగెన్‌  ప్రాసెసర్‌
1080x2280  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
4జీబీ ర్యామ్‌
64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌
256 జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌
16+5 ఎంపీ డ్యుయల్‌ రియల్‌ కెమెరా
24 ఎంపీ సెల్ఫీ కెమెరా
3260 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Advertisement
 
Advertisement
Advertisement