పెప్సికో ఉచిత టాక్‌టైమ్ ఆఫర్ | PepsiCo launches free talk time offer | Sakshi
Sakshi News home page

పెప్సికో ఉచిత టాక్‌టైమ్ ఆఫర్

Apr 19 2014 1:22 AM | Updated on Sep 2 2017 6:12 AM

పెప్సికో ఉచిత టాక్‌టైమ్ ఆఫర్

పెప్సికో ఉచిత టాక్‌టైమ్ ఆఫర్

పెప్సికో కంపెనీ 20-20 క్రికెట్ సీజన్ సందర్భంగా ఉచిత టాక్‌టైమ్ ఆఫర్‌ను అందిస్తోంది.

 న్యూఢిల్లీ: పెప్సికో కంపెనీ 20-20 క్రికెట్ సీజన్ సందర్భంగా ఉచిత టాక్‌టైమ్ ఆఫర్‌ను అంది స్తోంది. తమ ఆహార పానీయాలు, ఆహారోత్పత్తుల కొనుగోళ్లపై ఈ ఉచిత టాక్‌టైమ్ ఆఫర్‌ను పొందవచ్చని  పెప్సికో ఇండియా వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్) దీపికా వారియర్ తెలిపారు. పెప్సీ, సెవెనప్, మిరిండా ఆరెంజ్, మౌంటెన్ డ్యూ, స్లైస్‌లపై; కుర్‌కురే(రూ. 30 ప్యాక్), లేస్(రూ.35 ప్యాక్)లపై ఈ ఆఫర్ వర్తిస్తుందని చెప్పారు.

వీటి లేబుల్ వెనక గానీ, ప్యాక్ లోపల గానీ ఒక కోడ్ ఉంటుందని, ఆ కోడ్‌ను 9818181234కు ఎస్‌ఎంఎస్ చేస్తే రూ.10 టాక్‌టైమ్ పొందవచ్చన్నారు. లేదా పేటైమ్‌డాట్‌కామ్‌లో కోడ్‌ను ఎంటర్ చేస్తే రూ.15 టాక్‌టైమ్ లభిస్తుందని తెలిపారు. ఆఫర్ ప్రి పెయిడ్(ఎస్‌ఎంఎస్ లేదా ఆన్‌లైన్ రీచార్జ్), పోస్ట్ పెయిడ్(ఆన్‌లైన్ రీచార్జ్ మాత్రమే) కనెక్షన్లకు వర్తిస్తుందని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement