breaking news
Free Talktime Offer
-
Vodafone Idea: ఆ కస్టమర్లకు రూ.49 ప్యాక్ ఉచితం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 విపత్తు వేళ టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా ప్రత్యేక ప్రయోజనాలను ప్రకటించింది. తక్కువ ఆదాయమున్న 6 కోట్ల మంది కస్టమర్లకు రూ.49 రీచార్జ్ ప్యాక్‌ను ఒకసారి ఉచితంగా ఇవ్వనుంది. 28 రోజుల కాలపరిమితి గల ఈ ప్యాక్ కింద రూ.38 టాక్‌టైం, 100 ఎంబీ డేటా అందుకోవచ్చు. ఇక ఈ ప్రయోజనాల విలువ రూ.294 కోట్లు అని కంపెనీ వెల్లడించింది. అలాగే రూ.79 రీచార్జ్ ప్యాక్‌పై రూ.128 టాక్‌టైం, 200 ఎంబీ డేటా ఆఫర్ చేస్తున్నట్టు వొడాఫోన్ ఐడియా తెలిపింది. చదవండి: తెలుగు రాష్ట్రాల్లో దూసుకెళ్తున్న జియో -
పెప్సికో ఉచిత టాక్‌టైమ్ ఆఫర్
న్యూఢిల్లీ: పెప్సికో కంపెనీ 20-20 క్రికెట్ సీజన్ సందర్భంగా ఉచిత టాక్‌టైమ్ ఆఫర్‌ను అంది స్తోంది. తమ ఆహార పానీయాలు, ఆహారోత్పత్తుల కొనుగోళ్లపై ఈ ఉచిత టాక్‌టైమ్ ఆఫర్‌ను పొందవచ్చని పెప్సికో ఇండియా వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్) దీపికా వారియర్ తెలిపారు. పెప్సీ, సెవెనప్, మిరిండా ఆరెంజ్, మౌంటెన్ డ్యూ, స్లైస్‌లపై; కుర్కురే(రూ. 30 ప్యాక్), లేస్(రూ.35 ప్యాక్)లపై ఈ ఆఫర్ వర్తిస్తుందని చెప్పారు. వీటి లేబుల్ వెనక గానీ, ప్యాక్ లోపల గానీ ఒక కోడ్ ఉంటుందని, ఆ కోడ్‌ను 9818181234కు ఎస్ఎంఎస్ చేస్తే రూ.10 టాక్‌టైమ్ పొందవచ్చన్నారు. లేదా పేటైమ్డాట్కామ్లో కోడ్‌ను ఎంటర్ చేస్తే రూ.15 టాక్‌టైమ్ లభిస్తుందని తెలిపారు. ఆఫర్ ప్రి పెయిడ్(ఎస్ఎంఎస్ లేదా ఆన్లైన్ రీచార్జ్), పోస్ట్ పెయిడ్(ఆన్లైన్ రీచార్జ్ మాత్రమే) కనెక్షన్లకు వర్తిస్తుందని పేర్కొన్నారు.