పతంజలి ఆయుర్వేద చేతికి రుచి సోయా | Patanjali Ayurved completes acquisition of Ruchi soya | Sakshi
Sakshi News home page

పతంజలి ఆయుర్వేద చేతికి రుచి సోయా

Dec 19 2019 4:01 AM | Updated on Dec 19 2019 4:01 AM

Patanjali Ayurved completes acquisition of Ruchi soya - Sakshi

న్యూఢిల్లీ: రుచి సోయా కంపెనీ కొనుగోలు ప్రక్రియను పతంజలి ఆయుర్వేద పూర్తి చేసింది. కేసు పరిష్కార ప్రణాళికలో భాగం గా రుణ దాతల కోసం పతంజలి ఆయుర్వేద రూ.4,350 కోట్లను ఎస్క్రో అకౌంట్‌లో డిపాజిట్‌ చేయడంతో ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. రుచి సోయాకు రుణాలిచ్చిన రుణదాతలకు చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ఇప్పటి నుంచి రుచి సోయా తమ గ్రూప్‌ కంపెనీ అని పతంజలి ఆయుర్వేద ప్రతినిధి ఎస్‌.కె. తిజరీవాలా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement