
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తితో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్రం ప్రకటించిన రూ. 20లక్షల కోట్ల ప్యాకేజీపై ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్రం చర్యలతో ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి కొంత మేర అవకాశముందని.. కరోనా కారణంగా ఎదురైన నష్టాల నుంచి పూర్తిగా కోలుకునేందుకు మాత్రం ఈ చర్యలు ఉపయోగపడకపోవచ్చని మూడీస్ పేర్కొంది. ఎంఎస్ఎంఈ ప్యాకేజీపై మూడీస్ స్పందిస్తూ.. కరోనా వైరస్‌కు ముందే ఈ రంగం ఒత్తిడిని ఎదుర్కొందని, ప్రస్తుత సంక్షోభం కారణంగా నగదు లభ్యత కష్టాలు మరింత పెరిగాయని మూడీస్ అభిప్రాయపడింది.