విస్తరణ బాటలో ఓయో!: కవికృత్ | Oyo expansion path | Sakshi
Sakshi News home page

విస్తరణ బాటలో ఓయో!: కవికృత్

Aug 28 2015 12:51 AM | Updated on Sep 3 2017 8:14 AM

విస్తరణ బాటలో ఓయో!: కవికృత్

విస్తరణ బాటలో ఓయో!: కవికృత్

ఆతిథ్య రంగంలో ఉన్న ‘ఓయో రూమ్స్’ విస్తరణ బాటపట్టింది...

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆతిథ్య రంగంలో ఉన్న ‘ఓయో రూమ్స్’ విస్తరణ బాటపట్టింది. ఈ ఏడాది ముగింపు నాటికి 500 హోటళ్లు... 5 వేల గదుల్ని తమ బుకింగ్స్ పరిధిలోకి తీసుకురానున్నట్లు సంస్థ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ కవికృత్ చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో సేవలను ప్రారంభించిన ఓయోకు... ప్రస్తుతం ఇక్కడి 134 హోటళ్లలో 1,162 గదులున్నాయని గురువారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు.

గత ఆరునెలల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరంగల్, కర్నూల్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లో ఓయో సేవలను ప్రారంభించామని చెప్పారు. ‘‘మా సొంత హోటళ్లతో పాటు ఇతర హోటళ్లలో గదులను కూడా బుకింగ్ చేసుకునే వీలుండటం ఓయో ప్రత్యేకత. స్వాగత్, సితారా వంటి బడ్జెట్ హోటళ్లు ఓయోతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. గతేడాది డిసెంబర్‌లో ప్రారంభమైన ఓయో ఇప్పటివరకు 125 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. గతేడాది జనవరిలో జరిగిన సీడ్ రౌండ్‌లో లైట్ స్పీడ్ ఇండియా, జూన్‌లో జరిగిన సిరీస్-ఏ రౌండ్‌లో సెకోయా క్యాపిటల్ లు 8 మిలియన్ డాలర్లు, ఈ ఏడాది జనవరిలో గ్రీన్ ఓక్స్ 25 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement