ఎఫ్‌డీఐల సంస్థలకూ...ఆన్‌లైన్‌లో విక్రయ అనుమతులపై కసరత్తు | Sakshi
Sakshi News home page

ఎఫ్‌డీఐల సంస్థలకూ...ఆన్‌లైన్‌లో విక్రయ అనుమతులపై కసరత్తు

Published Wed, Sep 9 2015 12:33 AM

Online selling licenses to work

న్యూఢిల్లీ: భారత్‌లో తయారీ యూనిట్లున్న దేశీ, విదేశీ కంపెనీలు ఆన్‌లైన్లో కొనుగోలుదారులకు నేరుగా ఉత్పత్తులు విక్రయించుకునే వెసులుబాటు కల్పించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై కేంద్ర క్యాబినెట్ బుధవారం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశీయంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) ఈ ప్రతిపాదనను ఉద్దేశించినట్లు వివరించారు. ఇప్పుడున్న ఎఫ్‌డీఐ విధానం ప్రకారం ఈకామర్స్‌కి సంబంధించి బిజినెస్2బిజినె స్ విభాగంలో మాత్రమే ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది. బిజినెస్2కన్జూమర్ విభాగంలో అనుమతి లేదు.

Advertisement
Advertisement