వన్‌ప్లస్‌ 7టీ, ప్రొ ఫీచర్లివే..

OnePlus Pro Specifications Leak In Their Entirety - Sakshi

న్యూఢిల్లీ : వన్‌ప్లస్‌ 7టీ స్పెసిఫికేషన్స్‌పై గతంలో అక్కడక్కడా లీకులు వచ్చినా తాజాగా 7టీ, 7టీ ప్రొ ఫీచర్లన్నీ పూర్తిగా వెల్లడయ్యాయి. అధికారికంగా సెప్టెంబర్‌ 26న యూరప్‌లో విడుదల కానున్న ఈ రెండు ఒన్‌ప్లస్‌ హ్యాండ్‌సెట్స్‌ పూర్తి స్పెసిఫికేషన్స్‌ ఇవేనంటూ వన్‌ప్లస్‌ సీఈవో పెటె లావ్‌ వెల్లడించేశారు. ఈ హ్యాండ్‌సెట్లు క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 855ప్లస్‌ ప్రాసెసర్‌పై రన్‌ అవుతాయని గతంలో వచ్చిన వార్తలు వాస్తవమేనని తేలింది.

ఇక వన్‌ప్లస్‌ 7టీ 6.55 ఇంచ్‌లతో 90హెచ్‌జడ్‌ ఏఎంఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను కలిగిఉంటుంది. 7టీ ప్రొ అత్యున్నత రిజల్యూషన్‌తో అందుబాటులోకి రానుంది. ఈ రెండు డివైజ్‌ల్లో 48 మెగాపిక్సెల్‌తో కూడిన మూడు కెమెరాలుంటాయి. 8 మెగా పిక్సెల్‌ టెలిఫోటో, 16 మెగాపిక్సెల్‌ అల్ట్రా వీడియో కెమెరాలతో పాటు ముందు భాగంలో 16 మెగాపిక్సెల్‌ కెమెరా అమర్చారు. ఇక సైజ్‌కు తగినట్టే ఒన్‌ప్లస్‌ ప్రొ భారీ బ్యాటరీతో అందుబాటులోకి రానుంది. ఒన్‌ప్లస్‌ 7టీ జీబీ రామ్‌తో పాటు 3800 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉండగా ప్రొ 8జీబీ ర్యామ్‌, 4085 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో అందుబాటులోకి రానుంది. ఇక ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్‌ 10పై ఆక్సిజెన్‌ఓస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధారంగా పనిచేస్తాయి. ఈ ఫోన్‌ ధర రూ.65 వేల వరకు ఉండే అవకాశముంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top