వన్‌ప్లస్‌ 6టీ లాంచ్‌

OnePlus 6T launched in New York - Sakshi

న్యూయార్క్‌: ప్రముఖ చైనాకంపెనీ వన్‌ప్లస్‌ లేటెస్ట్‌ మొబైల్‌ను ఆవిష్కరించింది. వన్‌ప్లస్‌ 6టీ పేరుతో  సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను న్యూయార్క్‌లో లాంచ్‌ చేసింది. గత ఏడాది మేలో తీసుకొచ్చిన వన్‌ప్లస్‌ 6కి కొనసాగింపుగా దీన్ని తీసుకొచ్చింది.  ఈ రోజు (అక్టోబర్‌ 30)  సాయంత్రం 8.30 లకు ఢిల్లీలో లాంచ్‌  చేయనుంది. 6జీబీ/ 128జీబీ స్టోరేజ్‌  వెర్షన్‌ ధరను  సుమారు రూ. 40వేలు, 8జీబీ/128జీబీ స్టోరేజ్‌  వేరియంట్‌ ధరను రూ. 42,500, 8జీబీ/256జీబీ స్టోరేజ్‌ ధరను సుమారు రూ 46వేలుగా ఉంచింది. ఇండియాలో ధరలు కూడా ఇదే రేంజ్‌లో ఉండవచ్చని అంచనా.
 

వన్‌ప్లస్‌ 6టీ ఫీచర్లు
6.41 అంగుళాల ఆప్టిక్‌  అమోలెడ్‌ డిస్‌ప్లే
2340x1080 పిక్సెల్‌ రిజల్యూషన్‌
అక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 845
8జీబీ ర్యామ్‌, 256 స్టోరేజ్‌
16 + 20ఎంపీ రియర్‌  డ్యుయల​ కెమెరా
16ఎంపీ సెల్పీ  కెమెరా
3750 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top