తిరుపతి, విజయవాడల్లో ఓలా సేవలు | ola services in Tirupati, Vijayawada | Sakshi
Sakshi News home page

తిరుపతి, విజయవాడల్లో ఓలా సేవలు

May 9 2015 2:21 AM | Updated on Sep 3 2017 1:40 AM

తిరుపతి, విజయవాడల్లో ఓలా సేవలు

తిరుపతి, విజయవాడల్లో ఓలా సేవలు

క్యాబ్ సర్వీసులందించే ఓలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరిస్తోంది.

హైదరాబాద్: క్యాబ్ సర్వీసులందించే ఓలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరిస్తోంది. తాజాగా తిరుపతి, విజయవాడల్లో ఓలా క్యాబ్ సర్వీసులను ప్రారంభించామని ఓలా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. విజయవాడలో 150, తిరుపతిలో 75 క్యాబ్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఓలా డెరైక్టర్ (మార్కెటింగ్ కమ్యూనికేషన్స్) ఆనంద్ సుబ్రమణ్యన్ పేర్కొన్నారు. ఇప్పటికే హైదరాబాద్, విశాఖల్లో ఓలా క్యాబ్ సర్వీసులందజేస్తున్నామని  త్వరలో వరంగల్, రాజమండ్రి, గుంటూరు నగరాలకు కూడా ఓలా  సేవలను విస్తరించనున్నామని వివరించారు. ప్రారంభించిన ఏడాదిలోనే హైదరాబాద్‌లో 300 నుంచి 8,000 క్యాబ్స్‌కు వృద్ధి చెందామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement