కొత్త షేర్ల జారీ డీమ్యాట్‌ రూపంలోనే | From Oct 2, unlisted firms to issue new shares in demat form only | Sakshi
Sakshi News home page

కొత్త షేర్ల జారీ డీమ్యాట్‌ రూపంలోనే

Sep 12 2018 12:20 AM | Updated on Sep 12 2018 12:20 AM

From Oct 2, unlisted firms to issue new shares in demat form only - Sakshi

న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కాని కంపెనీలు కొత్త షేర్లను వచ్చే నెల 2 నుంచి డీమ్యాట్‌ రూపంలోనే జారీ చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఈ కంపెనీలు డీ మ్యాట్‌ లేదా ఎలక్ట్రానిక్‌ రూపంలోనే షేర్లను బదిలీ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్రమ నిధుల వరదను నిరోధించడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది.

పారదర్శకతను మరింతగా పెంచడానికి, ఇన్వెస్టర్ల రక్షణ నిమిత్తం, కార్పొరేట్‌ రంగంలో మంచి వాతావరణం సృష్టించడం లక్ష్యాలుగా ఈ నిర్ణయాలు తీసుకున్నామని కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డీమ్యాట్‌ రూపంలో షేర్లను జారీ చేయడం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయని సదరు మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగితం రూపంలోని షేర్ల వల్ల అవి చోరీకి గురికావడం, చినిగిపోవడం, మోసాలకు గురికావడం వంటి సమస్యలు ఉంటా యని వివరించింది. డీమ్యాట్‌ రూపంలో షేర్ల జారీ వల్ల ఈ సమస్యలుండవని పేర్కొంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement