ఆధార్‌-పాన్‌ లింక్‌.. నేడే చివరి తేదీ

Not Linked Your Aadhaar With PAN Yet? Hurry! Deadline Ends Today - Sakshi

న్యూఢిల్లీ : మీ బయోమెట్రిక్‌ ఐడీ-ఆధార్‌తో పర్మినెంట్‌ అకౌంట్‌ నెంబర్‌(పాన్‌)ను లింక్‌ చేసుకున్నారా? ఒకవేళ చేసుకోకపోతే, వెంటనే చేసేసుకోండి. ఆధార్‌-పాన్‌ అనుసంధానానికి నేడే ఆఖరి తేదీ. ఆధార్‌ను పాన్‌తో లింక్‌ చేసుకోవడానికి ఇప్పటి వరకు ప్రభుత్వం నాలుగు సార్లు తుది గడువు పొడిగించింది. నేటితో ఈ గడువు ముగియబోతోంది. అయితే మరోసారి కూడా ఈ తుది గడువును పొడిగిస్తారా? లేదా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. టెక్నికల్‌గా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 139ఏఏ(2) ప్రకారం ఆధార్‌తో పాన్‌ను తుది గడువు లోపు అనుసంధానం చేసుకోకపోతే, పాన్‌ కార్డు ఇన్‌వాలిడ్‌ అవుతుంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నుంచి తుది గడువుపై ఇంకా ఎలాంటి స్పష్టత రాకపోవడంతో, వెంటనే ఆధార్‌తో పాన్‌ను అనుసంధానం చేసుకోవాలని పలువురు పన్ను నిపుణులు సూచిస్తున్నారు. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ప్రస్తుతం ఆధార్‌ తప్పనిసరి. ఐదు తేలిక పద్ధతుల్లో ఆధార్‌ను పాన్‌తో లింక్‌ చేసుకోవచ్చు.

ఆధార్‌తో పాన్‌ను ఎలా అనుసంధానించుకోవాలో ఓసారి చూద్దాం.. 

స్టెప్‌ 1 : ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఈ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌కి వెళ్లాలి. టాప్‌ మధ్యలో బ్లూ రంగు బాక్స్‌ కనిపిస్తుంది. దానిలో కొన్ని ఫ్లాష్‌లు కనిపిస్తాయి. ఒక ఫ్లాష్‌ లో ‘లింక్‌ ఆధార్‌’ అనే బాక్స్‌ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేయాలి. వెంటనే వేరొక పేజీకి వెళ్తాం.. 
స్టెప్‌ 2 : అక్కడ పాన్‌ నెంబర్‌, ఆధార్‌ నెంబర్‌, ఇతర అవసరమైన వివరాలను నమోదు చేయాలి. ఆ అనంతరం కింద ఉన్న ‘లింక్‌ ఆధార్‌’ అనే దానిపై క్లిక్‌ చేయాలి.
స్టెప్‌ 3 : ఒక్కసారి రెండో స్టెప్‌ పూర్తయ్యాక, మీ అభ్యర్థనను యూఐడీఏఐకి పంపిస్తున్నట్టు మెసేజ్‌ కనిపిస్తుంది. హోమ్‌ పేజీలో ఉన్న ఆధార్‌ హైపర్‌ లింక్‌ను క్లిక్‌ చేసి స్టేటస్‌ను తెలుసుకోవాల్సిందిగా సూచిస్తుంది.
స్టెప్‌ 4 : మరోసారి హోమ్‌ పేజీకి వెళ్లి, లింక్‌ ఆధార్‌ను క్లిక్‌చేయాలి. ఆ అనంతరం వచ్చే పేజీలో పైననే... ఒకవేళ లింక్‌ ఆధార్‌ అభ్యర్థనను ఇప్పటికే సమర్పించి ఉంటే, స్టేటస్‌ తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి అని కనిపిస్తుంటుంది. దాన్ని క్లిక్‌ చేసి ఆధార్‌-పాన్‌ లింక్‌ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top