10 సెకన్లలోనే ఆ ఫోన్‌ అవుటాఫ్‌ స్టాక్‌

Nokia X6 Goes Out of Stock Within Seconds in First Sale - Sakshi

హెచ్‌ఎండీ గ్లోబల్‌ ఆకట్టుకునే ఫీచర్లతో  'ఎక్స్' సిరీస్ లోని తన మొదటి స్మార్ట్ ఫోన్ ‘నోకియా ఎక్స్‌6’ను మార్కెట్‌లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌ను నేడు జేడీ.కామ్‌, సన్నింగ్‌.కామ్‌, టీమాల్‌.కామ్‌లలో తొలిసారి విక్రయానికి వచ్చింది. సేల్‌కు వచ్చిన 10 సెకన్ల కంటే తక్కువ వ్యవధిలోనే నోకియా ఎక్స్‌6 స్మార్ట్‌ఫోన్‌ అవుటాఫ్‌ స్టాక్‌ అయింది. తొలి సేల్‌ కోసం సుమారు 7 లక్షల రిజిస్ట్రేషన్లు వచ్చినట్టు నోకియాపవర్‌హౌజ్‌ వెల్లడించింది. రెండో సేల్‌ మే 30న కంపెనీ నిర్వహించనుంది. ఆ సేల్‌ కోసం ప్రస్తుతం కంపెనీ రిజిస్ట్రేషన్లను చేపడుతోంది. ఏఐతో డ్యూయల్‌ రిలయర్‌ కెమెరా సెటప్‌, హెచ్‌డీఆర్‌ ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్‌ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. చైనాలో ఈ స్మార్ట్‌ఫోన్‌ 4జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 1,298 సీఎన్‌వై(సుమారు రూ.13,800)గా ఉంది. 4జీబీ ర్యామ్‌, 64జీబీ వేరియంట్‌ ధర 1,499 సీఎన్‌వై(సుమారు రూ.16వేలు) కాగ, 6జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 1,699 సీఎన్‌వై(సుమారు రూ.18,100)గా కంపెనీ నిర్ణయించింది.

నోకియా ఎక్స్‌6 స్పెషిఫికేషన్లు...
డ్యూయల్‌ సిమ్‌
ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో
5.8 అంగుళాల ఫుల్‌-హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
2.5డీ గొర్రిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌
ఆక్టా-కోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 636 ఎస్‌ఓసీ
16 మెగాపిక్సెల్‌, 5 మెగాపిక్సెల్‌ సెన్సార్లతో వెనుక డ్యూయల్‌ కెమెరా
16 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమరా
256జీబీ వరకు విస్తరణ మెమరీ
3060 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top