నిస్సాన్ మైక్రా.. ఆటోమేటిక్ వేరియంట్ | Nissan launches variant of Micra with automatic transmission | Sakshi
Sakshi News home page

నిస్సాన్ మైక్రా.. ఆటోమేటిక్ వేరియంట్

Sep 7 2016 12:51 AM | Updated on Sep 4 2017 12:26 PM

నిస్సాన్ మైక్రా.. ఆటోమేటిక్ వేరియంట్

నిస్సాన్ మైక్రా.. ఆటోమేటిక్ వేరియంట్

నిస్సాన్ ఇండియా తాజాగా తన ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ ‘మైక్రా’లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో కొత్త వేరియంట్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.

ముంబై: నిస్సాన్ ఇండియా తాజాగా తన ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ ‘మైక్రా’లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో కొత్త వేరియంట్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.5.99 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. కొత్త ఇంటీరియర్స్‌తో కూడిన ఈ ఆటోమేటిక్ వేరియంట్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదని నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ అరుణ్ మల్హోత్రా తెలిపారు.

ఈ కొత్త వేరియంట్‌లో నిస్సాన్ ఎక్స్-ట్రానిక్ సీవీటీని అమర్చామని, ఇది మాన్యువల్ వేరియంట్ కన్నా అధిక మైలేజ్‌ను అందిస్తుందని పేర్కొన్నారు. కాగా నిస్సాన్ కంపెనీ ఈ మోడల్‌ను చెన్నై ప్లాంటులో తయారు చేస్తోంది. దేశం నుంచి ఎగుమతి అవుతోన్న హ్యాచ్‌బ్యాక్ కార్లలో మైక్రాదే అగ్రస్థానం. ప్రస్తుతం మైక్రా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 మార్కెట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement