
చెన్నై: జపనీస్ ఆటోమేకర్ నిస్సాన్.. పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ‘డాట్సన్ గో, గో ప్లస్’ కార్లలో కొత్త వేరియంట్లను బుధవారం భారత మార్కెట్‌లో విడుదలచేసింది. దాదాపు 100కు పైగా అప్‌డేట్స్, 28 నూతన ఫీచర్లు ఈ వేరియంట్లలో ఉన్నట్లు ప్రకటించింది. గో బ్రాండ్ ధర రూ.3.29 లక్షలు కాగా, గో ప్లస్ ధర రూ.3.83 లక్షలుగా వెల్లడించింది. ఈ సందర్భంగా నిస్సాన్ ఇండియా మోటార్స్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) పీటర్ క్లిస్‌సోల్డ్ మాట్లాడుతూ.. ‘ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల లక్ష్యంగా నూతన ఆవిష్కరణలను కొనసాగిస్తున్నాం.
కారును కొనుగోలు చేసే ముందు కస్టమర్లు డీలరు వద్దకు వెళ్లి సర్వీస్ బాగుందనే విషయం తెలుసుకున్న తరువాత మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం 270 అవుట్‌లెట్లు ఉండగా.. ఈ ఏడాదిలో మరింత మంది డీలర్లు జతకానున్నారని అంచనావేస్తున్నాం. ఇక ఎగుమతుల విషయానికి వస్తే.. దక్షిణ ఆఫ్రికా, నేపాల్‌తో పాటు మరికొన్ని దేశాలకు ఎక్స్‌పోర్ట్స్ కొనసాగుతున్నాయి. తాజా వేరియంట్లలో మ రింత సౌకర్యవంతమైన, సురక్షితమైన జపనీస్ ఇంజినీరింగ్ టెక్నాలజీ ఉంది.’ అని వ్యాఖ్యానించారు.