వివో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ | New Vivo Budget Smartphone With Ultra-HD Technology In India | Sakshi
Sakshi News home page

వివో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌

Apr 30 2018 3:46 PM | Updated on Apr 30 2018 4:07 PM

New Vivo Budget Smartphone With Ultra-HD Technology In India - Sakshi

న్యూఢిల్లీ : చైనీస్‌ హ్యాండ్‌సెట్‌ తయారీదారి వివో తన ‘వై’ సిరీస్‌ను విస్తరించుకుంటూ వెళ్తోంది. ఈ విస్తరణలో భాగంగా ఆల్ట్రా-హెడ్‌ టెక్నాలజీతో ‘వై53ఐ’ స్మార్ట్‌ఫోన్‌ను వివో లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర 7,990 రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్‌కు ఆల్ట్రా-హెడ్‌ టెక్నాలజీ కూడిన 8 ఎంపీ రియర్‌ కెమెరా, 32ఎంపీ వరకు రెజుల్యూషన్‌ కలిగిన ఫోటోలను తీసే సామర్థ్యం ఉంటుంది. అదేవిధంగా ఈ ఫోన్‌కు 5ఎంపీ ఫ్రంట్‌ షూటర్‌ ఉంది. తక్కువ వెలుతురులో కూడా సెల్ఫీలను తీసుకునేందుకు వీలుగా ‘స్క్రీన్‌ ఫ్లాష్‌’ ఫీచర్‌ను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. 

క్రౌన్‌ గోల్డ్‌, మేట్‌ బ్లాక్‌ రంగుల్లో అన్ని ఆఫ్‌లైన్‌ స్టోర్‌లలో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంటుంది. వై53ఐ స్మార్ట్‌ఫోన్‌తో పోటీకరమైన ధర విధానంలో యూజర్లకు మంచి అనుభవాన్ని, అత్యుత్తమమై కెమెరాను అందించేందుకు తమ బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తున్నామని వివో ఇండియా సీఎంఓ కెన్నీ జెంగీ తెలిపారు. ఈ ఫోన్‌కు 5 అంగుళాల డిస్‌ప్లే, 2జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌, 256జీబీ వరకు విస్తరణ మెమరీ, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 425 ప్రాసెసర్‌, 2500 ఎంఏహెచ్‌ బ్యాటరీలు ఉన్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement