వివో కొత్త ఫోన్‌ వచ్చేసింది.. 200 మెగాపిక్సెల్‌ కెమెరాతో.. | Vivo V70 FE Launched A Powerhouse with 200MP Camera and 90W Fast Charging | Sakshi
Sakshi News home page

వివో కొత్త ఫోన్‌ వచ్చేసింది.. 200 మెగాపిక్సెల్‌ కెమెరాతో..

Apr 5 2026 7:58 AM | Updated on Apr 5 2026 11:00 AM

Vivo V70 FE Launched A Powerhouse with 200MP Camera and 90W Fast Charging

న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్‌ బ్రాండ్‌ వివో ‘వీ70 ఎఫ్‌ఈ’ పేరుతో ఫ్లాగ్‌షిప్‌ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్‌ ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 7360 టర్బో ప్రాసెసర్‌ ద్వారా పనిచేస్తుంది. 6.83 అంగుళాల ఓఎల్‌ఈడీ స్క్రీన్‌ ఉంది. వెనుక అల్ట్రా స్టెబిలైజేషన్‌ కలిగిన 200 మెగాపిక్సెల్‌ ప్రైమరీ కెమెరాతో పాటు 8ఎంపీ అ్రల్టావైడ్‌ డ్యూయల్‌ రియర్‌ కెమెరాలు కలిగి ఉంది.

ముందు భాగంలో 50ఎంపీ గ్రూప్‌ సెల్ఫీ కెమెరా ఉంది. 7,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది.  90వాట్ల ఫాస్ట్‌ ఛార్జర్‌ సపోర్ట్‌తో వచి్చంది. 8జీబీ+ 128జీబీ వేరియంట్‌ ధర రూ.37,999గా, 8జీబీ+ 256జీబీ వేరియంట్‌ రూ.40,999, 12జీబీ+ 256జీబీ వేరియంట్‌ రూ.44,999 ఉంది. వివో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లతో పాటు, రిటైల్‌ స్టోర్లలో ఏప్రిల్‌ 9 నుంచి కొనుగోలు చేయొచ్చు. 

Advertisement
 
Advertisement
Advertisement