ఎన్ కే సింగ్ కు జపాన్ ప్రతిష్టాత్మక అవార్డు | N K Singh gets Japan's prestigious national award | Sakshi
Sakshi News home page

ఎన్ కే సింగ్ కు జపాన్ ప్రతిష్టాత్మక అవార్డు

Apr 29 2016 3:53 PM | Updated on Sep 3 2017 11:03 PM

ఎన్ కే సింగ్ కు జపాన్ ప్రతిష్టాత్మక అవార్డు

ఎన్ కే సింగ్ కు జపాన్ ప్రతిష్టాత్మక అవార్డు

బీజేపీ ఎంపీ, మాజీ రాజ్యసభ సభ్యుడు నందకిషోర్ సింగ్ (75)జపాన్ కు చెందిన ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. ప్రతిష్టాత్మక 'ద ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్ గోల్డ్ అండ్ సిల్వర్ స్టార్' అవార్డు కు ఆయనను ఎంపిక చేసింది.

న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు  నందకిషోర్  సింగ్ (75) జపాన్ కు చెందిన ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. ప్రతిష్టాత్మక 'ద  ఆర్డర్ ఆఫ్ ద   రైజింగ్ సన్  గోల్డ్ అండ్ సిల్వర్ స్టార్' అవార్డు కు ఆయనను ఎంపిక చేసింది. బ్యూరోక్రాట్ టర్న్డ్  పొలిటీషియన్ ఎన్ కే సింగ్ గత కొన్ని దశాబ్దాలుగా ఇండో-జపాన్  ఆర్థిక సంబంధాల కోసం చేసిన కృషికి గాను ఆయనను  ఈ జాతీయ అవార్డుతో సత్కరించనుంది.  ప్రజపాన్ ప్రధాని అబే  ఎన్ కే సింగ్ కు   వ్యక్తిగత ఆహ్వానం పంపించారు.

ఈ  మే 10 న టోక్యోలోని ఇంపీరియల్ ప్యాలెస్లో జరిగే ఒక కార్యక్రమంలో, జపాన్ రాజు అకిహితో సమక్షంలో జపాన్ ప్రధానమంత్రి షింజే అబే చేతులు మీదుగా  ఈ అవార్డును సింగ్ అందుకోనున్నారు.  మనదేశ ప్రధాని నరేంద్ , మోదీ జపాన్ ప్రధాని  అబే నేతృత్వంలో ఇండో - జపాన్ సంబంధాల్లోచారిత్రక మార్పుల్లో భాగంగా తనకు ఈ అవార్డు దక్కిందని  సింగ్ వ్యాఖ్యానించారు. 21 వ శతాబ్దం ఆసియా పునరుజ్జీవనం ఇరుదేశాల లోతైన సంబంధాలపై ప్రధారంగా ఆధారపడి ఉందన్నారు. అత్యున్నత ప్రభుత్వ పదవులను నిర్వహాంచిన సింగ్ మంచి ఆర్థిక వేత్త. ఈ క్రమంలో ఆయన ప్లానింగ్ కమిషన్ సభ్యుడుగా తన సేవలందించారు. మారుతి సుజుకి సహా  జపనీస్ ఆటోమొబైల్ కంపెనీల  పెట్టుబడుల నిర్ణయం కాలంలో జపాన్ లో పనిచేశారు.1875 జపాన్ రాజు మియాసి ప్రవేశపెట్టిన ఈ సత్కారాన్ని1981 జపానేతరులకు అందిస్తున్నారు.


కాగా బీహార్ నుంచి జేడీయూ ఎంపీగా రాజ్యసభకు ఎంపికైన ఆయన 2014 లోబీజేపీలో  చేరారు. గతంలో భారత్ - జపాన్ దేశాల మధ్య స్నేహపూర్వక సంబంల్లో  కృషికి గుర్తింపుగా  భారత దేశ మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌  ద గ్రాండ్ కార్డన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద పౌలోనియా ఫ్లవర్స్ జపాన్ ప్రభుత్వం సత్కరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement