దేశంలో అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా? | mukesh ambani keeps his top rank in forbes india list | Sakshi
Sakshi News home page

దేశంలో అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా?

Sep 22 2016 9:37 AM | Updated on Oct 4 2018 4:43 PM

దేశంలో అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా? - Sakshi

దేశంలో అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా?

దేశంలో అత్యంత ధనవంతులైన పది మందిలో అగ్రస్థానాన్ని మళ్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ సొంతం చేసుకున్నారు.

దేశంలో అత్యంత ధనవంతులైన పది మందిలో అగ్రస్థానాన్ని మళ్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ సొంతం చేసుకున్నారు. ఆయన మొత్తం సంపద విలువ 1.52 లక్షల కోట్లు అని ఫోర్బ్స్ తాజా జాబితా తెలిపింది. గడిచిన సంవత్సరం ఆయన సంపద రూ. 1.26 లక్షల కోట్లు కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు గడిచిన ఏడాది కాలంలో 21% పెరిగాయని, అందుకే అంబానీ సంపద కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిందని ఫోర్బ్స్ తెలిపింది.

అంబానీ తర్వాత రెండో స్థానంలో ఫార్మా దిగ్గజం దిలీప్ సంఘ్వీ నిలిచారు. ఆయన మొత్తం సంపద రూ. 1.13 లక్షల కోట్లుగా తేలింది. సన్ ఫార్మా షేర్ల విలువ తగ్గడంతో గత ఏడాది కంటే ఆయన సంపద కొంత తగ్గిందని ఫోర్బ్స్ తేల్చింది. మూడో స్థానంలో హిందూజా సోదరులు నిలిచారు. శ్రీచంద్, గోపీచంద్, ప్రకాష్, అశోక్.. ఈ నలుగురు సోదరులూ కలిసి మొత్తం హిందూజా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఐదు దశాబ్దాలుగా విప్రోను ముందుండి నడిపిస్తున్న ఆ గ్రూపు అధినేత అజీమ్ ప్రేమ్‌జీ ఈసారి నాలుగో స్థానానికి పడిపోయారు.

కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పెద్దపీట వేయడంతో సిమెంటు, పెయింటు కంపెనీల వాళ్లు బాగుపడ్డారు. వేణుగోపాల్ బంగూర్ తొలిసారిగా టాప్ 20 జాబితాలో చోటు సంపాదించారు. ఆయనకు ఈ జాబితాలో 14వ స్థానం లభించింది. అలాగే ఏషియన్ పెయింట్స్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అశ్వినీ దాని కూడా 34వ స్థానానికి చేరుకున్నారు. ఈ ఏడాది భారత దేశంలో దాదాపు 6700 కోట్లకు పైగా సంపద పెంచుకున్నవాళ్లు మొత్తం 15 మంది ఉన్నారు. వాళ్లలో వీళ్లిద్దరికీ స్థానం లభించింది.

భారతదేశంలో టాప్ టెన్ కుబేరులు వీళ్లే..
1. ముకేష్ అంబానీ - 1.52 లక్షల కోట్లు
2. దిలీప్ సంఘ్వీ - 1.13 లక్షల కోట్లు
3. హిందూజా సోదరులు - 1.02 లక్షల కోట్లు
4. అజీం ప్రేమ్‌జీ - లక్ష కోట్లు
5. పల్లోంజీ మిస్త్రీ - 93వేల కోట్లు
6. లక్ష్మీ మిట్టల్ - 84వేల కోట్లు
7. గోద్రెజ్ కుటుంబం - 83 వేల కోట్లు
8. శివనాడార్ - 76వేల కోట్లు
9. కుమార్ బిర్లా - 59వేల కోట్లు
10. సైరస్ పూనావాలా - 57వేల కోట్లు

Advertisement
 
Advertisement
Advertisement