మారుతీ నుంచి మరిన్ని ప్రీమియం కార్లు | More premium cars from Maruti | Sakshi
Sakshi News home page

మారుతీ నుంచి మరిన్ని ప్రీమియం కార్లు

Aug 8 2015 12:42 AM | Updated on Sep 3 2017 6:59 AM

మారుతీ నుంచి మరిన్ని ప్రీమియం కార్లు

మారుతీ నుంచి మరిన్ని ప్రీమియం కార్లు

మారుతీ సుజుకీ మరిన్ని ప్రీమియం కార్లను మార్కెట్లోకి తేనుంది. దీంట్లో భాగంగా బాలెనో పేరుతో కొత్తగా ప్రీమియం

పండుగల సీజన్ కల్లా బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్
కంపెనీ చైర్మన్ ఆర్.సి. భార్గవ
 
 న్యూఢిల్లీ : మారుతీ సుజుకీ మరిన్ని ప్రీమియం కార్లను మార్కెట్లోకి తేనుంది. దీంట్లో భాగంగా బాలెనో పేరుతో కొత్తగా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను దసరా, దీపావళి పండుగల సీజన్‌లో మార్కెట్లోకి తేనున్నదని సమాచారం. వచ్చే నెలలో ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగే ఆటో షోలో ఈ కారును మారుతీ మాతృసంస్థ జపాన్‌కు చెందిన  సుజుకీ మోటార్ కార్ప్  ప్రదర్శించనుంది. పండుగల సీజన్‌కల్లా మరో కొత్త ప్రీమియం కాంపాక్ట్ కారును తేనున్నట్లు మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్.సి. భార్గవ వెల్లడించారు. కంపెనీ వాటాదారులకు నివేదించిన కంపెనీ వార్షిక నివేదిక (2014-15)లో ఆయన ఈ వివరాలు పేర్కొన్నారు.

గతంలో బాలెనో పేరుతో ఒక ప్రీమియం సెడాన్‌ను మారుతీ విక్రయించింది. దీనికి ఇప్పుడు తేనున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌కు పేరులో తప్ప మరేదాంట్లోనూ పోలిక లేదు.   ప్రస్తుతం మారుతీ సుజుకీ కంపెనీ ప్రీమియం సెడాన్ సెగ్మెంట్లో సియాజ్ కారును విక్రయిస్తోంది. ప్రీమి యం కార్ల కోసం నెక్సా విభాగాన్ని ఏర్పాటు చేసినట్లుగానే వాణిజ్య వాహనాల కోసం మరో ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నది.

Advertisement
 
Advertisement
Advertisement