మెర్సిడెస్ మేబ్యాక్@ రూ. 2.6 కోట్లు | Mercedes Maybach @ Rs. 2.6 cr | Sakshi
Sakshi News home page

మెర్సిడెస్ మేబ్యాక్@ రూ. 2.6 కోట్లు

Sep 25 2015 11:53 PM | Updated on Sep 3 2017 9:58 AM

మెర్సిడెస్ మేబ్యాక్@ రూ. 2.6 కోట్లు

మెర్సిడెస్ మేబ్యాక్@ రూ. 2.6 కోట్లు

మెర్సిడెస్ బెంజ్ ఇండియా(ఎంబీఐ) కంపెనీ సూపర్ లగ్జరీ సలూన్‌ను శుక్రవారం మార్కెట్లోకి తెచ్చింది. మేబ్యాక్ ఎస్600 పేరుతో అందిస్తున్న ఈ కారు ధర రూ.2.6 కోట్లని

పుణే : మెర్సిడెస్ బెంజ్ ఇండియా(ఎంబీఐ) కంపెనీ సూపర్ లగ్జరీ సలూన్‌ను శుక్రవారం మార్కెట్లోకి  తెచ్చింది.  మేబ్యాక్ ఎస్600 పేరుతో అందిస్తున్న ఈ కారు ధర రూ.2.6 కోట్లని (ఎక్స్ షోరూమ్, పుణే) కంపెనీ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇబర్‌హర్డ్ కెర్న్ చెప్పారు. దేశీయంగా అసెంబుల్ చేసిన మేబ్యాక్ ఎస్500ను కూడా అందుబాటులోకి తెచ్చామని, ధర రూ.1.67 కోట్లని పేర్కొన్నారు. ఈ కారుతో తాము దేశీయంగా అసెంబుల్ చేస్తున్న మోడళ్ల సంఖ్య ఎనిమిదికి పెరిగిందని చెప్పారు. 

దేశీయంగా లగ్జరీ కార్లలో అధిక మోడళ్లను అసెంబుల్ చేస్తున్న కంపెనీ తమదేనని వివరించారు. ప్రస్తుతం తాము సి, ఈ, ఎం, ఎస్ క్లాస్ మోడళ్లను, సీఎల్‌ఏ, జీఎల్‌ఏ, జీఏ క్లాస్ మోడళ్లను దేశీయంగా తయారు చేస్తున్నామని తెలిపారు.కాగా ఎంబీఐకు ఇప్పటిదాకా ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున కెర్న్ యూరప్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రోలాండ్ ఎస్ ఫోల్జ్ రానున్నారు. ఈ కార్యక్రమంలో రోలాండ్ కూడా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement