ఎంబసీ రీట్‌... 2.6 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌

MBC taps Du and Telstra for video connectivity - Sakshi

ఏప్రిల్‌ మొదటివారంలో లిస్టింగ్‌ 

న్యూఢిల్లీ: మన దేశపు తొలి రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (రీట్‌) 2.57 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. ఈ రీట్‌ ద్వారా ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ సంస్థ రూ.4,750 కోట్లు సమీకరించింది. వ్యూహాత్మక, యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి ఈ సంస్థ ఇటీవలనే రూ.2,619 కోట్లు సమీకరించింది. ఒక్కో యూనిట్‌కు ప్రైస్‌బాండ్‌ గా రూ.299–300 ధరలను నిర్ణయించారు. 7.13 కోట్ల యూనిట్లను ఆఫర్‌ చేస్తుండగా, మొత్తం 18.35 కోట్ల యూనిట్లకు బిడ్‌లు వచ్చాయి.
 

రీట్‌ యూనిట్లు వచ్చే నెల మొదటి వారంలో స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ, బ్లాక్‌స్టోన్, రియల్టీ కంపెనీ ఎంబసీ గ్రూప్‌ కలసి ఎంబసీ ఆఫీస్‌ పార్క్‌ పేరుతో జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. ఈ జేవీనే తొలి రీట్‌ను అందుబాటులోకి తెచ్చింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top