పేరు.. ఊరు మార్చుకున్న ‘సుజన’ | Mauritius bank rejects Sujana's repayment | Sakshi
Sakshi News home page

పేరు.. ఊరు మార్చుకున్న ‘సుజన’

Dec 30 2015 1:21 AM | Updated on Oct 16 2018 2:36 PM

పేరు.. ఊరు మార్చుకున్న ‘సుజన’ - Sakshi

పేరు.. ఊరు మార్చుకున్న ‘సుజన’

కేంద్ర మంత్రి సుజనా చౌదరికి చెందిన సుజన గ్రూపు కంపెనీల పేర్లు మారాయి.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కేంద్ర మంత్రి సుజనా చౌదరికి చెందిన సుజన గ్రూపు కంపెనీల పేర్లు మారాయి. వీటితో పాటు కంపెనీ నమోదిత కార్యాలయాలను కూడా మారుస్తున్నారు. దీనికి సంబంధించి ఆయా కంపెనీల  బోర్డులు మంగళవారం నిర్ణయం తీసుకున్నాయి. దీని ప్రకారం సుజన మెటల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను ఎస్‌ఎంపీఎల్‌గా మార్చి, కంపెనీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నారు.

మారిషస్ బ్యాంకు నుంచి అప్పు తీసుకుని ఎగ్గొట్టి, వివాదంలో చిక్కుకున్న సుుజన యూనివర్సల్  ఇండస్ట్రీస్ పేరును ఎస్‌యూఐఎల్‌గా మార్చి, కంపెనీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి తమిళనాడుకు మారుస్తున్నారు. సుజన టవర్స్ లిమిటెడ్‌ను ఎస్‌టీఎల్‌గా మార్చి, కంపెనీ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో చోటకి మార్చడానికి బోర్డు ఆమోదం తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement