పెరిగిన మారుతీ ‘డిజైర్‌’ ధర

Maruti Suzuki Dzire Car Price Rises - Sakshi

రూ.12,690 పెంపు

న్యూఢిల్లీ: మారుతీ సుజుకి ఇండియా తన పాపులర్‌ కాంపాక్ట్‌ సెడాన్‌ డిజైర్‌ కారు ధరను రూ.12,690 మేర పెంచినట్లు ప్రకటించింది. ఈ పెంపు గురువారం నుంచే అమల్లోకి వచ్చింది. నూతన భద్రతా ప్రమాణాలు, ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఈ కారును రూపొందించాల్సి రావడం వల్ల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. పెట్రోల్, డీజిల్‌ వెర్షన్లలో ఏఐఎస్‌–145 భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నట్లు నియంత్రణ సంస్థలకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది. నూతన ధరల అమలు తరువాత ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో ఈ కారు ధరల శ్రేణి రూ.5,82,613–రూ.9,57,622 కాగా, అంతక్రితం రూ.5,69,923 నుంచి రూ.9,54,522 శ్రేణిలో ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top