నిర్మలా సీతారామన్‌కు మారుతి కౌంటర్‌

Maruti Suzuki Counter to Nirmala Sitharaman - Sakshi

ఆటో మందగమనానికి ఓలా, ఉబెర్‌ కారణం కాదు - మారుతి

పూర్తి స్థాయి అధ్యయనం అవసరం

ఇప్పటికీ ప్రజల్లో కారు కొనాలన్న ఆకాంక్ష ఉంది

మారుతీ సుజుకీ శ్రీవాస్తవ

గువహటి: యువత (మిలీనియల్స్‌/20–40 మధ్యనున్నవారు) కార్లు కొనడానికి బదులు ఓలా, ఉబెర్‌ వంటి ట్యాక్సీ సేవలను వినియోగించుకోవడానికి మొగ్గు చూపుతుండడమే ఆటోమొబైల్‌ వాహన విక్రయాలు పడిపోవడానికి కారణమన్న కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్‌ వాదనను దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి అంగీకరించలేదు. వాహన విక్రయాల ప్రస్తుత మందగమనానికి ఇది బలమైన అంశం కానేకాదని, ఓ అభిప్రాయానికి రావడానికి ముందుగా పూర్తిస్థాయి అధ్యయనం అవసరమని పేర్కొంది. ప్రజలు ఇప్పటికీ కార్లను తమ ఆంకాక్ష మేరకు కొనుగోలు చేస్తున్నారని మారుతి సుజుకీ ఇండియా ఈడీ శశాంక్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు. యువత కార్లను కొని, ప్రతీ నెలా ఈఎంఐలు చెల్లించేందుకు ఇష్టపడడం లేదని, దీనికి బదులు వారు ట్యాక్సీ సేవల వైపు మొగ్గుతున్నారని మంత్రి నిర్మలా సీతారామన్‌ గత వారం చేసిన ప్రకటన పెద్ద చర్చకే తావిచి్చంది. ఓలా, ఉబెర్‌ అంశం ప్రస్తు్తత మందగమనానికి పెద్ద కారకం కాదన్నారు శ్రీవాస్తవ. ‘‘ఓలా, ఉబెర్‌ గత ఆరు, ఏడేళ్లుగా మార్కెట్లో ఉన్నాయి. ఈ సమయంలో ఆటో పరిశ్రమ అత్యుత్తమ ప్రదర్శన చవిచూసింది. గత కొన్ని నెలల్లోనే ఏమైంది? ఇది ఓలా, ఉబెర్‌ వల్లేనని ఆలోచించకండి’’ అని శ్రీవాస్తవ అన్నారు. అమెరికాలో ఉబెర్‌ బలమైన ప్లేయర్‌గా ఉన్నప్పటికీ, అక్కడ కార్ల విక్రయాలు గత కొన్ని సంవత్సరాల్లో బలంగానే ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఆకాంక్ష మేరకే...  
‘‘భారత్‌లో 46 శాతం మంది కార్లు కొనే వారు, మొదటి సారి కొనుగోలుదారులే. ఇది కారు కొనాలన్న వారి ఆకాంక్షల వల్లే. ప్రజలు ఓలా, ఉబెర్‌ ద్వారా వారం రోజులు ప్రయాణించినా కానీ, వారాంతంలో కుటుంబంతో కలసి బయటకు వెళ్లేందుకు వాహనాన్ని కొనుగోలు చేస్తున్నారు’’ అని శ్రీవాస్తవ చెప్పారు. ఆటో మార్కెట్‌ మందగమనానికి ఎన్నో కారణాలున్నాయని శ్రీవాస్తవ అన్నారు. మార్కెట్లో లిక్విడిటీ (నిధులు/రుణాలు) కొరత, నియంత్రణపరమైన అంశాల వల్ల (భద్రతా ఫీచర్ల అమలు వంటి) ఉత్పత్తుల ధరలు పెరగడం, అధిక పన్నులు, బీమా ప్రీమియం రేట్లు పెరగడాన్ని కారణాలుగా పేర్కొన్నారు. గత నెల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన చర్యలు దీర్ఘకాలానికి పరిశ్రమకు మేలు చేసేవని, ప్రస్తుత మందగమనానికి బ్రేక్‌ వేసేందుకు చాలవనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రానున్న పండుగల అమ్మకాలు ఆశాజనకంగా ఉంటాయన్న అంచనాను ఆయన ప్రకటించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top