మహీంద్ర కొత్త ఎక్స్‌యూవీ300 లాంచ్‌ 

Mahindra XUV300 Launched in India, Starting at Rs. 7.90 lakh - Sakshi

సాక్షి, ముంబై: మహీంద్ర అండ్‌  మహీంద్ర మరో సరికొత్త వాహనాన్ని లాంచ్‌ చేసింది. కాంపాక్ట్‌ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఎక్స్‌యూవీ 300 పేరుతో ఈ వెహికల్‌ను లాంచ్‌ చేసింది.  పెట్రోల్‌, డీజిల్‌ రెండు ఇంజీన్ల ఆప‍్షన్లలో ఆవిష్కరించింది.  రూ. 7.90 లక్షలు ప్రారంభధరగా నిర్ణయించగా,  టాప్‌ వేరియంట్‌ ధరను రూ.11.99లక్షలుగా ఉంచింది. 

1.5 లీటర్‌  ఫోర్‌ సిలిండర్‌  డీజిల్‌ ఇంజీన్‌ వెహికల్‌ 115 బీహెచ్‌పీ వద్ద 3750ఆర్‌పీఎం తో 300 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. 1.2 లీటర్‌ త్రి సిలిండర్‌ టర్బో చార్జ్‌డ్‌ పెట్రోల్‌ ఇంజీన్‌ 110 బీహెచ్‌పీ వద్ద 200 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. 

7 అంగుళాల టచ్‌ స్క్రీన్‌ ఇన్‌ఫోటైన్‌మెంట్‌ సిస్టం, కార్‌ ప్లే,   లాంటి ఫీచర్లను జోడించింది. అలాగే టాప్‌ ఎండ్‌ వేరియంట్లో7 ఎయిర్‌బాగ్స్‌,  డ్యుయల్‌ఎల్‌ఈడీ డే టైం ల్యాంప్స్‌, ఆటోమేటిక్‌ రెయిన్‌ సెన్సింగ్‌ వైపర్స్‌, రియర్‌ పార్కింగ్‌ అస్టిస్ట్‌ కెమెరా, 17 అంగుళాల డైమండ్‌ అల్లాయ్‌ వీల్స్‌ లాంటి  టాప్‌ ఎండ్‌ ఫీచర్లను అందిస్తోంది.  కాగా మారుతి సుజుకి బ్రెజ్జా, ఫోర్డ్‌ ఇకో స్పోర్ట్‌, టాటా నెక్సాన్‌కు గట్టిపోటీ ఇవ్వనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top