మహీంద్రా స్కార్పియో ఏటీ వేరియంట్ | Mahindra Scorpio AT variant | Sakshi
Sakshi News home page

మహీంద్రా స్కార్పియో ఏటీ వేరియంట్

Jul 29 2015 12:57 AM | Updated on Sep 3 2017 6:20 AM

మహీంద్రా స్కార్పియో ఏటీ వేరియంట్

మహీంద్రా స్కార్పియో ఏటీ వేరియంట్

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (ఏటీ) ఫీచర్‌తో సరికొత్త న్యూ జనరేషన్ స్కార్పియోను మార్కెట్‌లో

న్యూఢిల్లీ : మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (ఏటీ) ఫీచర్‌తో సరికొత్త న్యూ జనరేషన్ స్కార్పియోను మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర రూ.13.13 లక్షల నుంచి రూ.14.33 లక్షల (ఎక్స్‌షోరూం ఢిల్లీ) మధ్యలో ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ ఏటీ వేరియంట్ ఎస్‌యూవీ స్కార్పియో టాప్-ఎండ్ ఎస్10 వేరియంట్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. అత్యాధునిక టెక్నాలజీని వినియోగదారులకు అందించడంలో తాము ఎప్పుడూ ముందుంటామని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్) ప్రవీణ్ షా తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement