డ్రైవర్‌లెస్‌ ట్రాక్టర్‌ వస్తోంది... ఆవిష్కరించిన మహీంద్రా

డ్రైవర్‌లెస్‌ ట్రాక్టర్‌ వస్తోంది... ఆవిష్కరించిన మహీంద్రా - Sakshi


న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘మహీంద్రా అండ్‌ మహీంద్రా’ (ఎం అండ్‌ ఎం) తాజాగా తొలిసారిగా డ్రైవర్‌లెస్‌ ట్రాక్టర్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. కంపెనీ దీన్ని వచ్చే ఏడాది దశల వారీగా అందుబాటులోకి తీసుకురానుంది. చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్‌ వ్యాలీలో ఈ ట్రాక్టర్‌ను అభివృద్ధి చేశారు.


ఇక 20 హెచ్‌పీ– 100 హెచ్‌పీ శ్రేణిలోని ట్రాక్టర్లలోనూ డ్రైవర్‌లెస్‌ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. వ్యవసాయ విధానాల్లో తాజా కొత్త ఆవిష్కరణల వల్ల పలు మార్పులు చోటుచేసుకోవచ్చని, ఉత్పాదకతతోపాటు ఆహారోత్పత్తి పెరగొచ్చని ఎం అండ్‌ ఎం మేనేజింగ్‌ డైరెక్టర్‌ పవన్‌ గోయెంకా అభిప్రాయపడ్డారు. డ్రైవర్‌లెస్‌ ట్రాక్టర్లలో ఆటోస్టీర్, ఆటో హెడ్‌ల్యాండ్‌ టర్న్, రిమోట్‌ ఇంజిన్‌ స్టార్‌–స్టాప్‌ ఆప్షన్‌ వంటి పలు ప్రత్యేకతలున్నాయని వివరించారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top