మైండ్‌ట్రీలో ఎల్‌అండ్‌టీకి 20 శాతం వాటాలు  | L&T buys about 20% stake in Mindtree from VG Siddhartha | Sakshi
Sakshi News home page

మైండ్‌ట్రీలో ఎల్‌అండ్‌టీకి 20 శాతం వాటాలు 

May 2 2019 12:08 AM | Updated on May 2 2019 12:08 AM

 L&T buys about 20% stake in Mindtree from VG Siddhartha - Sakshi

న్యూఢిల్లీ: ఐటీ సంస్థ మైండ్‌ట్రీని టేకోవర్‌ చేసే యత్నాల్లో భాగంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ దిగ్గజం లార్సన్‌ అండ్‌ టూబ్రో (ఎల్‌అండ్‌టీ) మెజారిటీ వాటాల కొనుగోలు ప్రక్రియ మొదలుపెట్టింది. కెఫే కాఫీ డే, ఆ సంస్థ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థకు మైండ్‌ట్రీలో ఉన్న 3.27 కోట్ల షేర్లు (20.32 శాతం వాటాలు) మంగళవారం బ్లాక్‌ డీల్‌ ద్వారా ఎల్‌అండ్‌టీ కొనుగోలు చేసింది.

ఇందుకోసం రూ. 3,210 కోట్లు వెచ్చించింది. స్టాక్‌ ఎక్సే్చంజీ బీఎస్‌ఈకి కంపెనీ ఇచ్చిన సమాచారం ద్వారా ఈ విషయం వెల్లడైంది. మైండ్‌ట్రీని బలవంతంగా టేకోవర్‌ చేసేందుకు 66 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు ఎల్‌అండ్‌టీ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement