ఎల్‌ఐసీ నుంచి జీవన్ ప్రగతి | LIC's New Plan Jeevan Pragati | Sakshi
Sakshi News home page

ఎల్‌ఐసీ నుంచి జీవన్ ప్రగతి

Feb 4 2016 1:55 AM | Updated on Sep 3 2017 4:53 PM

ఎల్‌ఐసీ నుంచి జీవన్ ప్రగతి

ఎల్‌ఐసీ నుంచి జీవన్ ప్రగతి

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) తాజాగా ‘జీవన్ ప్రగతి’ ప్రొడక్ట్‌ను ఆవిష్కరించింది.

హైదరాబాద్: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) తాజాగా ‘జీవన్ ప్రగతి’ ప్రొడక్ట్‌ను ఆవిష్కరించింది. సంరక్షణ, సేవింగ్స్ ప్లాన్‌తో కూడిన ఈ నాన్-లింక్డ్ పాలసీ కాలంలో ప్రతి ఐదేళ్ల తరువాత దానంతట అదే రిస్క్ కవరేజ్ పెరుగుతుంది. అదే విధంగా అత్యవసర పరిస్థితుల్లో రుణ సౌలభ్యం కూడా ఈ పథకం ద్వారా పొందవచ్చు. బోనస్‌తోపాటు జీవిత బీమా మొత్తం మెచ్యూరిటీ ప్రయోజనంగా అందుతుంది. ప్రమాదవశాత్తు మరణం, అంగవైకల్యం ప్రయోజన రైడర్ అందుబాటులో ఉంది. 12 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు వారికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది. పాలసీ గడువు 12 నుంచి 20 ఏళ్లు. కనీస జీవిత బీమా మొత్తం రూ.1,50,000. గరిష్ట జీవిత బీమా మొత్తానికి సంబంధించి ఎటువంటి పరిమితి లేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement