ఎల్‌జీ జీ3 బీట్ @ రూ.25,000 | LG G3 Beat With Laser Autofocus Camera Launched at Rs. 25,000 | Sakshi
Sakshi News home page

ఎల్‌జీ జీ3 బీట్ @ రూ.25,000

Sep 18 2014 1:14 AM | Updated on Sep 2 2017 1:32 PM

ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ కొత్త స్మార్ట్‌ఫోన్, జీ3 బీట్‌ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది.

న్యూఢిల్లీ: ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ కొత్త స్మార్ట్‌ఫోన్, జీ3 బీట్‌ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ధర రూ.25,000 అని ఎల్‌జీ మొబైల్స్ ఇండియా మార్కెటింగ్ హెడ్ అమిత్ గుజ్రాల్ చెప్పారు. ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో 5 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 1.2 గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 1.3 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2,540 ఎంఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ, తదితర ఫీచర్లున్నాయని వివరించారు.

 అత్యున్నతమైన ఫీచర్లున్న స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరలోనే లభ్యం కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారని, అందుకే ప్రీమియం ఫీచర్లతో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటు ధరలోనే అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇంతకు ముందు తామందించిన ఎల్‌జీ జీ3కు మంచి స్పందన లభించిందని, ఆ ఉత్సాహాంతోనే ఈ జీ3 బీట్‌ను అందిస్తున్నామని వివరించారు. ఈ జీ3 సిరీస్ ఫోన్లతో ఈ ఏడాది చివరికల్లా భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 10 శాతం వాటా సాధించాలని ఎల్‌జీ లక్ష్యంగా పెట్టుకుంది. 2013లో రూ.800 కోట్లుగా ఉన్న తమ స్మార్ట్‌ఫోన్‌ల ఆదాయం ఈఏడాది రూ.2,000 కోట్లను దాటుతుందని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ అంచనా వేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement