breaking news
LG Mobiles
-
ఎల్జీ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం 'ఎల్జీ' మొబైల్ ఫోన్ మార్కెట్ నుంచి వైదొలగవచ్చనే ఊహగానాల మధ్య భారతదేశంలో ఎల్జీ కె42 స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఎల్జీ కె42 తన ఆధిక ఉష్ణోగ్రత, తక్కువ ఉష్ణోగ్రత, ఉష్ణోగ్రత షాక్, వైబ్రేషన్ వంటి తొమ్మిది పరీక్షల్లో యుఎస్ మిలిటరీ డిఫెన్స్ స్టాండర్డ్ అందుకున్నట్లు సంస్థ పేర్కొంది. ఎల్జీ కె42 అతిపెద్ద ఫీచర్ ఏమిటంటే ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్ MIL-STD-810G సర్టిఫైడ్ చేయబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ జనవరి 26 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా లభిస్తుంది. దీని ధర 10,990 రూపాయలు.(చదవండి: భారతీయ రైల్వే సరికొత్త రికార్డు!) ఎల్జీ కె42 ఫీచర్స్: ఎల్జీ కె42లో 6.6-అంగుళాల హెచ్ డి ప్లస్ డిస్ప్లే ఉంది. దీనిలో మీడియాటెక్ హెలియో పీ23 ప్రాసెసర్ తో పనిచేసే 3జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఉంది. కెమెరా విషయానికి వస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 13 ఎంపీ ప్రైమరీ కెమెరా, 5 ఎంపీ సూపర్ వైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపీ డెప్త్ కెమెరా, 2ఎంపీ మాక్రో కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీల కోసం 8 ఎంపీ సెల్ఫీ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. దీనిలో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ఎల్జీ కె42 ఆండ్రాయిడ్ 10లో ఎల్జి యుఎక్స్ ఓఎస్ తో నడుస్తుంది. ఇందులో కనెక్టివిటీ కోసం 4జీ ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ వి5.0, జీపీఎస్/ఎ-జీపీఎస్, యుఎస్బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. -
ఎల్జీ జీ3 బీట్ @ రూ.25,000
న్యూఢిల్లీ: ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ కొత్త స్మార్ట్‌ఫోన్, జీ3 బీట్‌ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ధర రూ.25,000 అని ఎల్జీ మొబైల్స్ ఇండియా మార్కెటింగ్ హెడ్ అమిత్ గుజ్రాల్ చెప్పారు. ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్లో 5 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 1.2 గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 1.3 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2,540 ఎంఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ, తదితర ఫీచర్లున్నాయని వివరించారు. అత్యున్నతమైన ఫీచర్లున్న స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరలోనే లభ్యం కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారని, అందుకే ప్రీమియం ఫీచర్లతో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటు ధరలోనే అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇంతకు ముందు తామందించిన ఎల్జీ జీ3కు మంచి స్పందన లభించిందని, ఆ ఉత్సాహాంతోనే ఈ జీ3 బీట్‌ను అందిస్తున్నామని వివరించారు. ఈ జీ3 సిరీస్ ఫోన్లతో ఈ ఏడాది చివరికల్లా భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 10 శాతం వాటా సాధించాలని ఎల్జీ లక్ష్యంగా పెట్టుకుంది. 2013లో రూ.800 కోట్లుగా ఉన్న తమ స్మార్ట్ఫోన్ల ఆదాయం ఈఏడాది రూ.2,000 కోట్లను దాటుతుందని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అంచనా వేస్తోంది.