చిన్నపిల్లలకు లెనోవా స్పెషల్... | Lenovo CG Slate is an educational tablet for kids priced at Rs 7499 | Sakshi
Sakshi News home page

చిన్నపిల్లలకు లెనోవా స్పెషల్...

Jul 6 2016 1:57 PM | Updated on Jul 11 2019 5:24 PM

చిన్నపిల్లలకు లెనోవా స్పెషల్... - Sakshi

చిన్నపిల్లలకు లెనోవా స్పెషల్...

టెక్నాలజీకి ఎక్కువగా ఆకర్షితులవుతున్న చిన్న పిల్లల కోసం, ఓ స్పెషల్ ఎడ్యుకేషనల్ టాబ్లెట్ ను లెనోవా ఆవిష్కరించింది.

టెక్నాలజీకి ఎక్కువగా ఆకర్షితులవుతున్న చిన్న పిల్లల కోసం, ఓ స్పెషల్ ఎడ్యుకేషనల్ టాబ్లెట్ ను లెనోవా ఆవిష్కరించింది. "సీబీ స్లేట్" పేరుతో ఆవిష్కరించిన ఈ టాబ్లెట్ ను, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ కాన్వెజీనియస్ భాగస్వామ్యంతో రూ.8,499కు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎడ్యుటైన్ మెంట్ సొల్యూషన్ గా కంపెనీ పిలుచుకునే ఈ లెర్నింగ్ డివైజ్, ఎన్ సీఈఆర్టీ సిలబస్ తో గ్రేడ్ కే-5 స్టూడెంట్లకు అందుబాటులో ఉచ్చింది లెనోవా సీజీ స్లేట్ ఎక్స్ క్లూజివ్ గా ఫ్లిప్ కార్ట్ లో లభ్యం కానుంది. మొదటి 1,000 యూనిట్లను రూ.7,499కు విక్రయించనుంది. అనంతరం రూ.8,499కే కంపెనీ అమ్మకాలు నిర్వర్తించనుంది.

సీబీ స్లేట్ ఎడ్యుటైన్ మెంట్ సొల్యూషన్ ప్రధాన ఫీచర్లు...

  • వీడియో స్టోరీలు, డిజిటల్ బుక్స్, వర్క్ షీట్లు, గేమ్స్ ద్వారా వివిధ సబ్జెక్టులను పిల్లలు నేర్చుకోవచ్చు. ఎన్ సీఈఆర్ టీ సిలబస్ ఆధారితంగా వీటిని టాబ్లెట్ లో పొందుపరిచారు.
  • గేమిఫైడ్ విధానం ద్వారా పిల్లుల పాఠాలు నేర్చుకునేలా ఈ టాబ్లెట్ ను రూపొందించారు. ఉత్తేజకరమైన కార్టూన్లు, మూవీలు, గేమ్స్ తో ప్లే జోన్ ను ఏర్పాటుచేశారు. ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ కాయిన్స్ ను పిల్లలు ఈ గేమ్ లో పొందవచ్చు.  
  • లెర్నింగ్, ఎంటర్ టైన్ మెంట్, షాపింగ్ కు ఈ టాబ్లెట్ బెస్ట్ ఫ్రెండ్ లా ఈ టాబ్లెట్ ఉండనుంది.


ఎడ్యుకేషన్, ఎంటర్ టైన్ మెంట్ కు లెనోవా బెస్ట్ డివైజ్ లను మార్కెట్లోకి విడుదలచేస్తుందని, సీజీ స్లేట్ చిన్న పిల్లలకు నేర్చుకోగలిగినంత జ్ఞానార్జన అనుభూతిని అందిస్తుందని లెనోవా కంపెనీ మార్కెటింగ్ డైరెక్టర్ భాస్కర్ చౌదురీ తెలిపారు.

ప్రత్యేకతలు..

  • 7 అంగుళాల ఐపీఎస్ డిస్ ప్లే
  • 1.3 జీహెచ్ జడ్ క్వాడ్ కోర్ మీడియా టెక్ ఎమ్ టీ8127 ప్రాసెసర్
  • 1జీబీ ర్యామ్
  • 8 జీబీ, 16 జీబీ రెండు స్టోరేజ్ వేరియంట్లు
  • 32 జీబీ వరకూ విస్తరణ మెమెరీ
  • 2 ఎంపీ వెనుక కెమెరా
  • వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
  • 3,450 ఎంఏహెచ్ బ్యాటరీ
  • ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్
  • 3.5 ఎంఎం ఆడియో జాక్
  • ఫ్రంట్ స్పీకర్, వై-ఫై, బ్లూటూత్ 4.0, మైక్రో యూఎస్ బీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement