గతవారం బిజినెస్‌

Last week's business - Sakshi

ఆటోమొబైల్స్
♦  ‘మోటరోలా’ తాజాగా ‘మోటో ఎక్స్‌4’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 20,999.  
 ‘మహీంద్రా అండ్‌ మహీంద్రా’ తన ఎస్‌యూవీ ‘స్కార్పియో’లో కొత్త అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.9.97 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ) ఉంది.
 జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) ఇండియా తన పాపులర్‌ ఎస్‌యూవీ ’ఎఫ్‌పేస్‌’ అసెంబుల్‌ను స్థానికంగానే ప్రారంభించింది. పుణే ప్లాంటులో దీన్ని తయారు చేస్తోంది. దీని ధర రూ.60.02 లక్షలు.   
 చైనా మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ’ఇన్‌ఫినిక్స్‌ మొబైల్‌’ తాజాగా తన ’జీరో’ సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌పోన్లను మార్కెట్‌లో ఆవిష్కరించింది. జీరో–5, జీరో–5 ప్రో అనే ఈ రెండు ఫోన్ల ధర వరుసగా రూ.17,999గా, రూ.19,999గా ఉంది.  
 చైనా మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ’జియోనీ’ తాజాగా ’ఎం7 పవర్‌’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర రూ.16,999.  

భారత్‌ రేటింగ్‌ పెంచిన మూడీస్‌
భారత్‌ చేపడుతున్న సంస్కరణలను అమెరికా రేటింగ్స్‌ సంస్థ మూడీస్‌ ఎట్టకేలకు గుర్తించింది. భారత సార్వభౌమ రేటింగ్‌ను బీఏఏ3 నుంచి బీఏఏ2కు పెంచుతూ మోదీ సర్కారుకు ఊరట కల్పించింది. భారత్‌ విషయంలో తన దృక్పథాన్ని సానుకూలం నుంచి స్థిరత్వానికి సవరించింది.  

వన్నె తగ్గుతున్న గోల్డ్‌ ఈటీఎఫ్‌లు
గోల్డ్‌ ఎక్సే్చంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్ల (ఈటీఎఫ్‌) ప్రాభవం తగ్గుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌– అక్టోబర్‌ మధ్య కాలంలో వీటి నుంచి ఇన్వెస్టర్లు రూ.422 కోట్ల పెట్టుబడుల్ని వెనక్కు తీసుకున్నారు. గతేడాది ఇదే వ్యవధిలో ఈ మొత్తం రూ.519 కోట్లు.   

శాంసంగ్‌= షావోమి?
చైనా స్మార్ట్‌ఫోన్స్‌ తయారీ కంపెనీ ’షావోమి’.. దక్షిణ కొరియా మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ సంస్థ శాంసంగ్‌కు తను ఏమాత్రం తక్కువ కాదనే రీతిలో భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో వాటాను సాధిం చింది.   ఈ ఏడాది క్యూ3లో శాంసంగ్‌తో పాటు అగ్రస్థానాన్ని పంచుకుంది. 23.5% మార్కెట్‌ వాటాను సంపాదించుకుంది.  

ధర.. దడ...
ఇంధనం, ఆహార పదార్ధాల రేట్లు పెరగడంతో అక్టోబర్‌లో టోకు ధరల ఆధారిత సూచీ (డబ్ల్యూపీఐ) ఆరు నెలల గరిష్టానికి ఎగిసి 3.59 శాతానికి చేరుకుంది. సెప్టెంబర్‌లో ఇది 2.60 శాతంగా ఉండగా, గతేడాది అక్టోబర్‌లో 1.27 శాతంగానే నమోదయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన 3.85 శాతం స్థాయి అనంతరం ఆరు నెలల తర్వాత అక్టోబర్‌లో నమోదైనదే అత్యధికం కావడం గమనార్హం.    

41 చమురు క్షేత్రాలకు ఓఎన్‌జీసీ, కెయిర్న్‌ బిడ్లు
చమురు, గ్యాస్‌ క్షేత్రాల వేలంలో ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీ, కెయిర్న్‌ ఇండియా సంస్థలు అత్యధిక క్షేత్రాలకు బిడ్లు వేశాయి.  ఓఏఎల్‌ విధానం కింద తొలిసారిగా నిర్వహించిన వేలంలో ఓఎన్‌జీసీ 41 క్షేత్రాలకు, వేదాంత గ్రూప్‌లో భాగమైన కెయిర్న్‌ ఇండియా 15 క్షేత్రాలకు బిడ్లు దాఖ లు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వరంగానికి చెందిన మరో సంస్థ ఆయిల్‌ ఇండియా, ప్రైవేట్‌ సంస్థ హిందుస్తాన్‌ ఆయిల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ కూడా ఈ వేలంలో పాల్గొన్నాయి.  

 అక్టోబర్‌లో ఎగుమతులు డౌన్‌
జీఎస్టీ అమలు అనంతరం ఎగుమతిదారులకు లిక్విడిటీపరమైన సమస్యల నేపథ్యంలో దాదాపు ఏడాది తర్వాత ఎగుమతులు క్షీణించాయి. అక్టోబర్‌లో 1.12% మేర తగ్గాయి. గతేడాది అక్టోబర్‌లో 23.36 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఎగుమతులు ఈసారి గత నెలలో 23.09 బిలియన్‌ డాలర్లకే పరిమితమయ్యాయి. చివరిగా 2016 ఆగస్టులో ఎగుమతులు క్షీణించాయి. ఇక గత నెల దిగుమతులు 7.6 % వృద్ధితో 34.5 బిలియన్‌ డాలర్ల నుంచి 37.11 బిలియన్‌ డాలర్లకు చేరాయి.

మిలియనీర్లు 2,45,000 మంది...
భారత్‌లో మిలియనీర్ల సంఖ్య 2,45,000 దాటింది. దేశంలోని మొత్తం కుటుంబాల సంపద విలువ 5 ట్రిలియన్‌ డాలర్లుగా ఉ న్నట్లు అంతర్జాతీయ ఆర్థికసేవల సంస్థ క్రెడిట్‌ సూసీ పేర్కొంది.

ఫండ్‌ బిజినెస్‌లోకి ఫెడరల్‌ బ్యాంక్‌!
ఫెడరల్‌ బ్యాంక్‌ తాజాగా మ్యూచువల్‌ ఫండ్‌ (ఎంఎఫ్‌) వ్యాపా రంలోకి అడుగుపెట్టాలని భావిస్తోంది. తన పూర్తి అనుబంధ ఎన్‌బీఎఫ్‌సీ విభాగం ’ఫెడ్‌ఫినా’లో 26% వాటా విక్రయించి సబ్సిడరీ ఏర్పాటుకు నిధులను సమీకరించే ప్రక్రియలో నిమగ్నమయింది.

డీల్స్‌..
టెలికం దిగ్గజాలు వొడాఫోన్‌ ఇండియా, ఐడియా సెల్యులార్‌ సంస్థలు దేశీయంగా తమ తమ టవర్ల వ్యాపారాలను ఏటీసీ టెలికం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి విక్రయించాలని నిర్ణయించాయి. ఈ డీల్‌ విలువ సుమారు రూ. 7,850 కోట్లు. ఈ ఒప్పందాల కింద వొడాఫోన్‌ ఇండియాకి రూ.3,850 కోట్లు, ఐడియాకి రూ.4,000 కోట్లు లభిస్తాయి.  
రుణభారాన్ని తగ్గించుకునేందుకు భారతీ ఎయిర్‌టెల్‌ తమ అను బంధ సంస్థ భారతి ఇన్‌ఫ్రాటెల్‌లో 8.3 కోట్ల షేర్లను మార్కెట్లో విక్రయించింది. తద్వారా రూ.3,325 కోట్లు సమీకరించింది.  
సింగపూర్‌ లిస్టెడ్‌ సంస్థ ఆర్‌హెచ్‌టీ హెల్త్‌ ట్రస్ట్‌కు (ఆర్‌హెచ్‌టీ) చెందిన వ్యాపార విభాగాలను కొనుగోలు చేసే ప్రతిపాదనకు ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈ డీల్‌ విలువ రూ. 4,650 కోట్లుగా ఉంటుందని వెల్లడించింది.  
బ్రిటిష్‌ టెలికం దిగ్గజం వొడాఫోన్‌... తాజాగా ఇండస్‌ టవర్స్‌లో వాటాలను విక్రయించే అవకాశాలను పరిశీలిస్తోంది. పూర్తిగా లేదా పాక్షికంగా వాటాలను విక్రయించేందుకు ఉన్న వ్యూహాలన్నింటినీ పరిశీలిస్తున్నట్లు వొడాఫోన్‌ గ్రూప్‌ సీఈవో విటోరియో కొలావో వెల్లడించారు.  
ఇన్పోసిస్‌ తన ఉద్యోగులకు సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీలో శిక్షణ ఇచ్చేందుకు అంతర్జాతీయ ఆన్‌లైన్‌ శిక్షణా సంస్థ ఉడాసిటీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ప్రకటించింది.  
ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ త్వరలో భారత్‌లో ఎలక్ట్రిక్‌ కార్లను (ఈవీ) ప్రవేశపెట్టే దిశగా కసరత్తు మొదలెట్టింది. దీనికోసం టొయోటాతో చేతులు కలిపింది. 2020 నాటికల్లా భారత్‌లో ఈవీలను ప్రవేశపెట్టడంలో పరస్పరం సహకరించుకునేందుకు రెండు సంస్థలు ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.
టెలికం సర్వీసులకు సంబంధించి వేగవంతమైన 5జీ టెక్నాలజీపై కసరత్తు చేసేందుకు భారతి ఎయిర్‌టెల్‌ తాజాగా స్వీడన్‌కు చెందిన ఎరిక్సన్‌తో చేతులు కలిపింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top