పెరగనున్న పెద్ద టీవీల ధరలు  | Large TVs prices will rise | Sakshi
Sakshi News home page

పెరగనున్న పెద్ద టీవీల ధరలు 

Jul 30 2018 12:15 AM | Updated on Jul 6 2019 3:20 PM

Large TVs prices will rise - Sakshi

న్యూఢిల్లీ: పెద్ద స్క్రీన్‌ టీవీల ధరలు వచ్చే నెల నుంచి పెరగనున్నాయి. 32 అంగుళాలు, అంతకంటే ఎక్కువ స్క్రీన్‌ సైజు ఉన్న వాటి ధరల్ని పెంచాలని టీవీల కంపెనీలు యోచిస్తున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడంతో కంపెనీలపై ప్రకటనల ఖర్చు పెరిగింది. అలాగే ప్యానళ్ల ధరలు కూడా పెరిగాయి. ఈ భారం తగ్గించుకునేందుకు కంపెనీలు విక్రయ ధరల్ని పెంచాలనుకుంటున్నాయి. హైయర్‌ కంపెనీ 5% వరకు పెంచనుంది. ఆగస్ట్‌ మూడో వారం నుంచి పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించింది.

‘‘ధరల్ని 4–5 శాతం స్థాయిలో పెంచనున్నాం. ఇది దాదాపు ఆగస్ట్‌ మూడో వారం నుంచి ఉండొచ్చు’’ అని హైయర్‌ ఇండియా ప్రెసిడెంట్‌ ఎరిక్‌ బ్రగంజ తెలిపారు. డాలర్‌ బలపడడం, టీవీ ప్యానళ్ల ధరలు అంతర్జాతీయంగా పెరగడంతో ధరల్ని పెంచక తప్పడం లేదన్నారు.   ‘‘టీవీ ప్యానళ్ల ధరలు పెరగడం, మారకం రేటు ప్రభావం నేపథ్యంలో 32 అంగుళాలు ఆపై సైజున్న టీవీలీ ధరల పెంపు ఉంటుంది. ఇందుకోసం మార్కెట్‌ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం’’అని ప్యానాసోనిక్‌ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో మనీష్‌ శర్మ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement