డ్యూక్ 790 స్పోర్ట్స్‌ బైక్‌‌.. ధరెంతో తెలుసా..!! | KTM Duke 790 Bike Launched In Indian Market | Sakshi
Sakshi News home page

డ్యూక్ 790 స్పోర్ట్స్‌ బైక్‌‌.. ధరెంతో తెలుసా..!!

Sep 23 2019 6:48 PM | Updated on Sep 23 2019 7:03 PM

KTM Duke 790 Bike Launched In Indian Market - Sakshi

‘డ్యూక్ 790’  బైక్‌ను సోమవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 799 సీసీ ఇంజిన్‌ సామర్థ్యం గల ఈ బైక్‌ ఎక్స్‌షోరూమ్‌ ప్రారంభ ధర రూ.8.64 లక్షలుగా కంపెనీ పేర్కొంది.

న్యూఢిల్లీ : ఆస్ట్రియా దేశానికి చెందిన స్పోర్ట్స్‌ బైక్స్‌ తయారీ సంస్థ కేటీఎమ్‌.. అధునాతన ‘డ్యూక్ 790’  బైక్‌ను సోమవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 799 సీసీ ఇంజిన్‌ సామర్థ్యం గల ఈ బైక్‌ ఎక్స్‌షోరూమ్‌ ప్రారంభ ధర రూ.8.64 లక్షలుగా కంపెనీ పేర్కొంది. దేశవ్యాప్తంగా తొమ్మిది నగరాల్లో.. బెంగుళూరు, ముంబై, పుణె, హైదరాబాద్‌, సూరత్‌, ఢిల్లీ, కోల్‌కత, చెన్నై, గువాహటిల్లో డ్యూక్ 790 బైక్‌ను ఈ రోజు నుంచే బుక్‌ చేసుకోవచ్చని కంపెనీ అధికారులు తెలిపారు. క్రోమియం మాలిబ్డినం స్టీల్ ఫ్రేమ్‌తో మిరుమిట్లు గొలుపుతున్న ఈ బైక్‌పై ఈఎంఐ సదుపాయం కల్పిస్తున్నట్టు బజాజ్‌ ఆటో ఫిన్‌కార్ప్‌ తెలిపింది. 1.70 లక్షల డౌన్‌పేమెంట్‌తో, నెలకు రూ.19 వేలు ఈఎంఐతో బైక్‌ను సొంతం చేసుకోవచ్చని వెల్లడించింది. గతేడాది డ్యూక్‌ 200 బైక్‌ను కేటీఎమ్‌ మార్కెట్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement